అన్ని ఎమోషన్స్ ఉన్న హారర్ థ్రిల్లర్

అన్ని ఎమోషన్స్ ఉన్న హారర్ థ్రిల్లర్

నవీన్ చంద్ర లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నందిని జె.ఎస్ తెరకెక్కించిన వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌ ‘ఇన్స్‌‌‌‌‌‌‌‌పెక్టర్ రిషి’. సునైన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సుఖ్ దేవ్ లాహిరి నిర్మించారు. ఈనెల 29 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించారు. హీరో నవీన్ చంద్ర మాట్లాడుతూ

‘ఈ కథ విన్నప్పుడు హారర్, థ్రిల్లర్, సస్పెన్స్, యాక్షన్  లాంటి అన్ని ఎమోషన్స్ ఇందులో ఉన్నాయనిపించింది. కథతో పాటు రిషి పాత్రలో అనేక లేయర్స్ ఉన్నాయి. హారర్ థ్రిల్లర్స్‌‌‌‌‌‌‌‌లో ఇదొక ప్రత్యేకమైన సిరీస్ అవుతుంది. రిషి లాంటి క్యారెక్టర్ దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. మొత్తం పది ఎపిసోడ్స్ ఉన్నాయి’ అని చెప్పాడు. డైరెక్టర్ నందిని మాట్లాడుతూ

‘నాకు చిన్నప్పటి నుంచి హారర్ మూవీస్ చూడటం ఇష్టం. ఆ ఆసక్తితో ఈ హారర్ సబ్జెక్ట్ రెడీ చేసుకుని సిరీస్ తీశాను. నవీన్ చంద్ర, సునైన తెలుగులో చాలా పాపులర్‌‌ కనుక మంచి రీచింగ్ ఉంటుందని ఆశిస్తున్నాం’ అన్నారు. సునైన, కన్నా రవి, శ్రీ కృష్ణ దయాల్ కూడా మాట్లాడారు.