ప్రణాళికతో చదివితే విజయం సాధ్యం

 ప్రణాళికతో చదివితే విజయం సాధ్యం

హసన్ పర్తి, వెలుగు : ఇంటర్ విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను సాధించుకునే దశలో ఉన్నారని, ఈ రెండు సంవత్సరాలు విద్యపై పూర్తి దృష్టి పెట్టి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాల‌ని ఇన్స్పైర్ జూనియర్ కాలేజ్ చైర్మన్ తీగల భారత్ గౌడ్  పిలుపునిచ్చారు. భీమారం‌ ఎర్రగట్టుగుట్ట పరిధిలోని బాలాజీ గార్డెన్స్ లో ఇన్స్పైర్ జూనియర్ కాలేజ్ అక్విలా 2025 ఫ్రెషర్స్ డే ఘనంగా నిర్వహించారు.

 ఈ సందర్బంగా తీగల భారత్ గౌడ్ మాట్లాడుతూ ప్రణాళికతో ముందుకు సాగితే విజయాలు సాధించవచ్చన్నారు. అనంతరం 2025లో 470కు 468 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్  ర్యాంక్ సాధించిన విద్యార్థిని సాయి శ్రేష్ఠితకు కళాశాల యాజమాన్యం తరఫున రూ.లక్ష నగదు బహుమతి అందించారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు శ్రీరాం రెడ్డి, రాజ్ కుమార్, మమత, శివ తదితరులు పాల్గొన్నారు.