గ్రామీణ బ్యాంకుల్లో కొలువుల జాతర.. 13,217 పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్..

గ్రామీణ బ్యాంకుల్లో కొలువుల జాతర.. 13,217 పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్..

ఇన్​స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్(ఐబీపీఎస్ ఆర్ఆర్ బీ) XIV రిక్రూట్​మెంట్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్), ఆఫీసర్ స్కేల్- I, -II, III పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 21. 

పోస్టుల సంఖ్య: 13217.  

పోస్టులు: ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్) 7972, ఆఫీసర్ స్కేల్- I (అసిస్టెంట్ మేనేజర్) 3907, ఆఫీసర్ స్కేల్ -II (అగ్రికల్చర్ ఆఫీసర్) 50, ఆఫీసర్ స్కేల్ II(లా) 48, ఆఫీసర్ స్కేల్ –II(సీఏ) 69, ఆఫీసర్ స్కేల్ II (ఐటీ) 87, ఆఫీసర్ స్కేల్ II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్) 854, ఆఫీసర్ స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్) 15, ఆఫీసర్ స్కేల్ II (ట్రెజరీ మేనేజర్) 16, ఆఫీసర్ స్కేల్ III 199.  

తెలంగాణ గ్రామీణ బ్యాంకుల్లో 450 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. (ఎస్సీ 72, ఎస్టీ 32, ఓబీసీ 121, ఈడబ్ల్యూఎస్ 45, జనరల్ 180, పీడబ్ల్యూబీడీ 45, ఎక్స్ సర్వీస్ మెన్ 20), ఆఫీసర్ స్కేల్– I  225 పోస్టులు( ఎస్సీ 34, ఎస్టీ 17, ఓబీసీ 61, ఈడబ్ల్యూఎస్ 22, జనరల్ 91, పీడబ్ల్యూబీడీ 7, ఎక్స్ సర్వీస్​మెన్ 2), ఆఫీసర్ స్కేల్ –II 100 పోస్టులు ఉన్నాయి.(ఎస్సీ 15, ఎస్టీ 08, ఓబీసీ 27, ఈడబ్ల్యూఎస్ 10, జనరల్ 40, పీడబ్ల్యూబీడీ 3, ఎక్స్ సర్వీస్​మెన్ 1). 

ఎలిజిబిలిటీ:
ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. 
ఆఫీసర్ స్కేల్- I:  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్​మెంట్, లా, ఎకనామిక్స్ లేదా అకౌంటెన్సీలో డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. 
ఆఫీసర్ స్కేల్ -II: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్​మెంట్, లా, ఎకనామిక్స్ లేదా అకౌంటెన్సీలో డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. 
ఆఫీసర్ స్కేల్ II స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (మేనేజర్): కనీసం 50 శాతం మార్కులతో ఎలక్ట్రానిక్స్/ కమ్యూనికేషన్/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. ఇన్​స్టిట్యూ ట్​ఆఫ్​  చార్టర్డ్​  అకౌంట్స్ ఆఫ్​ ఇండియా నుంచి అసోసియేట్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. సీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 
ఆఫీసర్ స్కేల్ -III: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్​మెంట్, లా, ఎకనామిక్స్ లేదా అకౌంటెన్సీలో డిప్లొమా/ డిగ్రీ కలిగి ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు. 

వయోపరిమితి
ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్): 18 నుంచి 28 ఏండ్లు. 
ఆఫీసర్ స్కేల్– I: 18 నుంచి 30 ఏండ్లు. 
ఆఫీసర్ స్కేల్ –II:  21 నుంచి 32 ఏండ్లు. 
ఆఫీసర్ స్కేల్ III: 21 నుంచి 40 ఏండ్లు.
 నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
సెలెక్షన్ ప్రాసెస్: ఆఫీస్ అసిస్టెంట్స్(మల్టిపర్పస్) ప్రిలిమినరీ, మెయిన్స్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆఫీసర్ స్కేల్- I, -II, III పోస్టులకు అదనంగా ఇంటర్వ్యూ ఉంటుంది. 
పూర్తి వివరాలకు  www.ibps.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్), ఆఫీసర్ స్కేల్- I ప్రిలిమ్స్ ఎగ్జామ్: ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చే మార్కులను తుది ఎంపికలో పరిగణించరు. ప్రిలిమినరీ ఎగ్జామ్​లో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో అడుగుతారు. మొత్తం 80 ప్రశ్నలు 80 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. రీజనింగ్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు 40 మార్కులకు అడుగుతారు. 

మెయిన్స్​ ఎగ్జామినేషన్
ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్): మెయిన్స్​లో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. సెక్షన్-–1లో రీజనింగ్ 40 ప్రశ్నలు, 40 మార్కులకు, సెక్షన్-–2లో కంప్యూటర్ నాలెడ్జ్ 40 ప్రశ్నలు, 40 మార్కులకు, సెక్షన్- 3లో జనరల్ అవేర్​నెస్ 40 ప్రశ్నలు, 20 మార్కులకు, సెక్షన్- 4aలో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు, 40 మార్కులకు, సెక్షన్- 4bలో హిందీ లాంగ్వేజ్ 40 ప్రశ్నలు, 40 మార్కులకు, సెక్షన్- 5లో న్యూమరికల్ ఎబిలిటీ 40 ప్రశ్నలు, 40 మార్కులకు అడుగుతారు. 4a, 4bలో ఏదైనా ఒక ఎగ్జామ్​ను అభ్యర్థులు ఎంపిక చేసుకోవచ్చు. ఆఫీసర్ స్కేల్- I మెయిన్స్ ఎగ్జామ్​లో ఆఫీస్ అసిస్టెంట్ సిలబసే ఉంటుంది. కానీ, మార్కుల కేటాయింపులో తేడాలు ఉన్నాయి గమనించగలరు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు ఎగ్జామ్​ల్లోనూ నెగిటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25వ వంతు మార్కులు కోత విధిస్తారు. 

తుది ఎంపిక
ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్) మెయిన్స్​లో సాధించిన మార్కుల ఆధారంగా ఫైనల్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఆఫీసర్ స్కేల్- –I మెయిన్స్​లో సాధించిన మార్కుల ఆధారంగా ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మెయిన్స్,  ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 01. 
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 21.
అప్లికేషన్ ఫీజు:  ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.175. ఇతరులకు రూ850. 
ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్: 2025, నవంబర్. 
ప్రిలిమినరీ ఎగ్జామ్ (ఆఫీసర్/ ఏఓ): 2025, నవంబర్/ డిసెంబర్. 
ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజర్ట్స్: 2025, డిసెంబర్.
ఆన్ లైన్ మెయిన్/ సింగల్ (ఆఫీసర్/ ఏఓ): 2025, డిసెంబర్/ 21026, ఫిబ్రవరి.  
ఇంటర్వ్యూ: ఆఫీసర్ (స్కేల్ I, II, III) పోస్టులకు 2026, జనవరి/ ఫిబ్రవరి.
ఎగ్జామ్ సెంటర్లు: తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్​నగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ నగరాల్లో మాత్రమే మెయిన్ ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి.