
- మూలకణాలను దానం చేసి ఆదర్శంగా నిలిచిన ఇంటర్ స్టూడెంట్
పద్మారావునగర్, వెలుగు: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదేండ్ల తమ్ముడిని రక్షించేందుకు తన మూలకణాలు దానం చేసింది ఓ అక్క. ఇంటర్ చదువుతున్న అక్క మూలకణాల దానంపై ఉన్న భయాలను, అపోహలను అధిగమించి వాటిని డొనేట్ చేసి ఆదర్శంగా నిలిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ్ముడికి పండుగ సందర్భంగా శనివారం రాఖీ కూడా కట్టింది.
మహబూబ్‌నగర్‌కు చెందిన ఐదేండ్ల బాలుడికి తీవ్రమైన అప్లాస్టిక్ అనీమియా అనే వ్యాధి నిర్ధారణ అయ్యింది. బాలుడికి ట్రీట్మెంట్ అందిస్తున్న సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు మూలకణాలను మార్చాలని సూచించారు. దీంతో ఇంటర్ చదువుతున్న అక్క.. తమ్ముడికి ధైర్యం చెప్పి తన శరీరంలోని మూలకణాలను దానం చేసి అతని ప్రాణాలు కాపాడింది. రాఖీ పండుగ రోజున హాస్పిటల్‌కు వెళ్లి తమ్ముడికి రాఖీ కట్టి ధైర్యం చెప్పింది.