బిట్​ బ్యాంక్​: హిమాలయాలు

బిట్​ బ్యాంక్​: హిమాలయాలు
  •     ప్రస్తుత హిమాలయాల భూభాగంలో మధ్యయుగంలో టెథిస్​ సముద్రం అనే ఒక పెద్ద భూ అభినతి ఉండేది. 
  •     టెథిస్​ సముద్రానికి ఉత్తరంగా ఉన్న భూభాగాన్ని అంగారా భూమి అని దక్షిణంగా ఉన్న భూభాగాన్ని గోండ్వానా భూమి (నేటి ద్వీపకల్పం) అని పిలిచేవారు.
  •     టెర్షియరీ యుగంలో అంగారా భూమి, గోండ్వానా భూమి ఒక దానికి ఒకటి వ్యతిరేక దిశలో జరగడం వల్ల టెథిస్​ సముద్రంలో ఉన్న అవక్షేప శిలలు సంపీడన బలాల వల్ల ముడతలు పడి హిమాలయాలు ఏర్పడ్డాయి. 
  •     భారతదేశంలో భూకంపాలు ఎక్కువగా హిమాలయాల ప్రాంతాల్లో సంభవిస్తాయి. 
  •     ఇవి ప్రపంచంలోనే ఎత్తయిన పర్వతాలు.
  •     ఇవి నవీన లేదా తరుణ ముడత పర్వతాలు. వయస్సు ఆరు కోట్ల సంవత్సరాలు. 
  •     హిమాలయాలు సింధు నదీలోయ, బ్రహ్మపుత్ర నదీలోయల మధ్య జమ్ముకశ్మీర్​ నుంచి అరుణాచల్​ప్రదేశ్​ల మధ్య కొడవలి ఆకారంలో లేదా అర్ధ చంద్రాకారంలో విస్తరించి ఉన్నాయి.
  •     వీటి పొడవు సుమారు 2400 కి.మీ., విస్తీర్ణం 5 లక్షల చ.కి.మీ.
  •     వీటి వెడల్పు అరుణాచల్​ప్రదేశ్​లో 200 కి.మీ.లు కాగా, కశ్మీర్​లో 500 కి.మీ.ల ఉంది. సరాసరి వెడల్పు 240 కి.మీ.
  •     స్థూలంగా చూస్తే హిమాలయాల్లో మూడు సమాంతర ముడత శ్రేణులు ఉన్నాయి.
  • 1.    ఎ. ఉత్తరంగా ఉన్న హిమాద్రి 
  •     (ఉన్నత హిమాలయాలు)
  •     బి. మధ్యన ఉన్న హిమాచల్​ 
  • (నిమ్న హిమాలయాలు)
  •     సి. దక్షిణంగా ఉన్న శివాలిక్​ శ్రేణి 
  •     (బాహ్య హిమాలయాలు) 
  • 2. ట్రాన్స్​ హిమాలయాలు లేక టిబెట్​ హిమాలయాలు. ఇవి అత్యున్నత హిమాలయాలు పైన ఉన్నాయి.
  • 3. తూర్పు హిమాలయాలు లేదా పూర్వాంచల్​ హిమాలయాలు
  • ఎ. హిమాద్రి (గ్రేటర్​ హిమాలయాలు)
  •     హిమాలయ పర్వత శ్రేణులన్నింటిలోకి ఇది అత్యున్నత, ఉత్కృష్ట, అవిఛ్చిన్న శ్రేణి.
  •     వీటి సరాసరి ఎత్తు సుమారు 6100 మీటర్లు. వెడల్పు 25 కి.మీ.
  •     ఇది నంగప్రభాత్​ శిఖరం నుంచి నామ్చాబార్వా శిఖరం మధ్యలో ఉంది. 
  •     ఈ పర్వత శ్రేణిలో ప్రపంచంలోనే ఎత్తయిన పర్వత శిఖరాలు ఉన్నాయి. మొత్తం 11 శిఖరాలు ఉన్నాయి. 
  • 1. ఎవరెస్ట్​ శిఖరం 
  •     ప్రపంచంలోనే ఎత్తయిన శిఖరం.
  •     దీని పొడవు 8848 మీటర్లు. లేదా 29,035 అడుగులు. (ప్రస్తుత ఎత్తు 8850 మీటర్లు)
  •     ఇది నేపాల్​లో ఉంది.
  •     ఈ శిఖరాన్ని నేపాల్​లో సాగరమాత అని, టిబెట్​లో చోమోలుంగుమో అని, చైనాలో కెమోలుంబుమో అని పిలుస్తారు.
  •     బ్రిటీష్​ సర్వేయర్​ జనరల్​ సర్​ జార్జ్​ ఎవరెస్ట్​ పేరు మీదుగా దీనిని ఎవరెస్ట్​ అని పిలుస్తారు. 
  • 2. కే2 (గాడ్విన్​, ఆస్టిన్​)
  •     ఇది ట్రాన్స్​ హిమాలయాల్లో పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఉంది.
  •     ఇది భారతదేశంలో ఎత్తయిన శిఖరం. దీని ఎత్తు 8611 మీటర్లు.
  •     ఈ శిఖరాన్ని క్వీన్​ ఆఫ్ హిమాలయాస్​ అని పిలుస్తారు. 
  •     ఈ శిఖరాన్ని భారతదేశంలో కృష్ణగిరి అని, పాకిస్తాన్​లో చెగౌరి అని, చైనాలో ఖ్వఘర్​ అని పిలుస్తారు. 
  • 3.  కాంచనగరం
  •     దీని ఎత్తు 8598 మీటర్లు.
  •     భారతదేశంలో రెండో ఎత్తయిన శిఖరం.
  •     సిక్కింలో ఉంది.
  • 4. మకాలు 
  •     దీని ఎత్తు 8481 మీటర్లు. నేపాల్లో ఉంది.
  • 5. ధవళగిరి
  •     దీని ఎత్తు 8177 మీటర్లు. నేపాల్​లో ఉంది.
  • 6. నంగప్రభాత్​
  •     దీని ఎత్తు 8126 మీటర్లు. ఇది జమ్ముకశ్మీర్​లో ఉంది.
  • 7. అన్నపూర్ణ
  •     దీని ఎత్తు 8078 మీటర్లు, ఇది నేపాల్​లో ఉంది.
  •     ఇతర పర్వత శిఖరాలు మనస్లూ (8156 మీటర్లు), చోఓయు (8153 మీటర్లు), నందదేవి (7817 మీటర్లు), నామ్చాబార్వా (7756 మీటర్లు) కూడా ఇక్కడే ఉన్నాయి.
  •     ఈ పర్వత శ్రేణిలో కింది ముఖ్యమైన కనుమలు ఉన్నాయి.
  • 1. బనిమల్​ కనుమ: దీనిగుండా జవహర్​ సొరంగం పోవుతున్నది. ఈ కనుమను గేట్​ వే ఆఫ్​ కశ్మీర్​ అని అంటారు. 
  • 2. జోజలా కనుమ: ఇది లే, జమ్ము ప్రాంతాలను కలుపుతుంది.
  • 3. షిప్​కిలా కనుమ: ఈ కనుమ గుండా సట్లెజ్​ నది టిబెట్​ నుంచి భారతదేశంలోకి ప్రవేశిస్తోంది. 
  • 4. రోహతంగ్​ కనుమ: ఇటీవల భారత ప్రభుత్వం ఈ కనుమగుండా 8.8  కి.మీ. పొడవైన సొరంగం ప్రారంభించింది. ఇది మనాలి, లఢఖ్​లను కలుపుతుంది.
  • 5. నాథులా కనుమ: సిక్కిం రాష్ట్రంలోని ఈ కనుమను 1962లో భారత్​– చైనా యుద్ధం సందర్భంగా మూసివేశారు. తిరిగి 44 సంవత్సరాల తర్వాత 2006లో మళ్లీ ప్రారంభించారు.