నారా రోహిత్ కి కాబోయే భార్య సిరి లెల్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

నారా రోహిత్ కి కాబోయే భార్య సిరి లెల్ల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

తెలుగుప్రముఖ హీరో నారా రోహిత్ హీరోయిన్  సిరి లెల్లని పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఆదివారం (అక్టోబర్ 13)  హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. దీంతో నారా రోహిత్ కి కాబోయే భార్య సిరి లెల్ల గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు.

సిరి లెల్ల పూర్తీ పేరు శిరీష లెల్ల.  సిరి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ విషయానికొస్తే తండ్రి రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్, తల్లి హౌజ్ వైఫ్.  అయితే ఇప్పటివరకూ సిరి తల్లిదండ్రులు మీడియాకి దూరంగా ఉండటంతో చాలామందికి ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి పెద్దగా వివరాలు తెలియవు. అయితే సిరి కి 4 అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఇందులో ముగ్గురు ఇప్పటికే గవర్నమెంట్ ఉద్యోగం, విదేశాలలో ఉద్యోగం అంటూ సెటిల్ అయ్యారు.

అయితే సిరి ఫ్యామిలీ రిచ్ కావడంతో విదేశాల్లో చదువుకుంది. కానీ చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం మీద ఆసక్తి లేకపోవడంతో విదేశాల నుంచి తిరిగి వచ్చింది. ఆ తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలగడంతో సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నించింది.  

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఫోటో షూట్లు, రీల్స్ షేర్ చేస్తూ దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. దీంతో సిరి యాక్టింగ్ స్కిల్స్ మెచ్చిన న్యూస్ రీడర్ మరియు డైరెక్టర్ మూర్తి దర్శకత్వం వహించిన ప్రతినిధి 2 చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే నారా రోహిత్ మరియు సిరి ప్రేమలో పడ్డారు. దీంతో ఇరివురి కుటుంబ సభ్యులను ఒప్పించి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు.  

అయితే ప్రతినిధి 2 చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో హీరోయిన్ అవ్వాలనుకన్న సిరి కి ఆదిలోనే నిరాశ ఎదురైంది. మరి పెళ్లి తర్వాత సినిమాల్లో కంటిన్యూ అవుతుందో లేక సినిమాలకి గుడ్ బై చెప్పి కుటుంబ బాధ్యతలు చక్కబెట్టే పనిలో బిజీ అవుతుందో చూడాలి. 

ఇటీవలే జరిగిన నారా రోహిత్ హీరోయిన్  సిరిల గేజ్మెంట్ ఫంక్షన్ కి ప్రముఖ హీరో నందమూరి బాలకృష్ణ,  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దంపతులు, బంధువులు తదితరులు హాజరై నూతన వధూవరులకి శుభాకాంక్షలు తెలిపారు. కాగా డిసెంబర్‌ 15న వీళ్లిద్దరిపెళ్లికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నారా రోహిత్ తెలుగులో సుందరకాండ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వెంకటేశ్  నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్ర టీజర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.