
‘గులాబీకి ఆ పేరు తప్ప.. వేరే ఏ పేరు పెట్టినా అంత బాగుండేది కాదేమో!’. షేక్స్పియర్ తన కవిత్వంలో చెప్పిన ఈ మాట అక్షరాలా నిజం. కానీ, అలా అంతా అనుకుని ఉంటే ‘వెరైటీ’కి స్కోప్ ఉండేది కాదు. జనాలంతా ఆ వెరైటీ గురించి అంతగా మాట్లాడుకునేవాళ్లు కాదేమో కదా!. సాధారణంగా ప్రతీ ఊరికి ఒక కథ, నేపథ్యం, పేరు ఉంటాయి. కానీ, కొన్ని ఊళ్లకు పేర్లు మాత్రమే కాదు.. ఆ పేర్లు రావడానికి విచిత్రమైన కారణాలు కూడా ఉన్నాయి!. అలాంటి ఊళ్లలో కొన్ని…
‘గులాబీకి ఆ పేరు తప్ప.. వేరే ఏ పేరు పెట్టినా అంత బాగుండేది కాదేమో!’. షేక్స్పియర్ తన కవిత్వంలో చెప్పిన ఈ మాట అక్షరాలా నిజం. కానీ, అలా అంతా అనుకుని ఉంటే ‘వెరైటీ’కి స్కోప్ ఉండేది కాదు. జనాలంతా ఆ వెరైటీ గురించి అంతగా మాట్లాడుకునేవాళ్లు కాదేమో కదా!. సాధారణంగా ప్రతీ ఊరికి
ఒక కథ, నేపథ్యం, పేరు ఉంటాయి. కానీ, కొన్ని ఊళ్లకు పేర్లు మాత్రమే కాదు.. ఆ పేర్లు రావడానికి విచిత్రమైన కారణాలు కూడా ఉన్నాయి!. అలాంటి ఊళ్లలో కొన్ని…
బ్యాట్‌మ్యాన్
టర్కీలోని ఒక ప్రావిన్స్ పేరు బ్యాట్‌మ్యాన్. విశేషం ఏంటంటే దాని రాజధాని పేరు కూడా అదే. బ్యాట్‌మ్యాన్ రివర్(టైగ్రిస్ నదికి ఉపనది) దగ్గర్లో ఉండటంతో దీనికి ఈ పేరు వచ్చిందనుకుంటారు చాలా మంది. కానీ, చరిత్రకారులు మాత్రం రకరకాల కారణాలు చెప్తుంటారు. బ్యాట్‌మన్ అనేది ఒక ‘కొలమానం’ అని కొందరు, బాటీ రామన్ కొండలు దగ్గర్లో ఉండటంతో ఈ ప్లేస్‌కి ‘బ్యాట్‌మ్యాన్’ అనే పేరు వచ్చిందని మరికొందరు చెప్తారు.
ఆ కన్ఫ్యూజన్ అలాగే కొనసాగుతుండగా 2008లో ఈ ప్రావిన్స్ పేరు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అందుకు కారణం ‘డార్క్‌నైట్’ సినిమా. ఈ సినిమా డైరెక్టర్ క్రిస్టోఫర్
నోలన్‌కి, ప్రొడక్షన్ హౌజ్ వార్నర్ బద్రర్స్‌కి ఈ ప్రావిన్స్ మేయర్ హుసైన్ కల్కన్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. తమ ప్లేస్ పేరుతో విలన్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దావా వేసినంత పని చేశాడు. తర్వాత కొన్నేళ్లకు మరోసారి వార్తల్లో నిలిచింది ఈ ప్రాంతం.
సుమారు ఇరవై ఆరు వేల మంది ఒక సైన్ పిటిషన్‌తో ప్రభుత్వం ముందు ఒక ప్రపోజల్ ఉంచారు. ఇంతకీ వాళ్లు కోరిందేంటంటే.. ఆ ప్రావిన్స్ సరిహద్దును బ్యాట్(గబ్బిలం) ఆకారంలోకి మార్చాలని. కానీ, గవర్నమెంట్ ఆ ప్రపోజల్‌ని పక్కకు పెట్టేసింది.
హాటాజెల్
ఇది సౌతాఫ్రికాలోని ఒక ఊరి పేరు. మొదట్లో ‘హాట్ ఆజ్ హెల్’ ఈ ఊరి పేరు. కాలక్రమంలో హాటాజెల్‌గా మారింది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉండేదట. ఆ కారణంగా పంటలు కూడా సరిగ్గా పండేవి కావట. దీంతో 1915లో కొందరు రైతులు ఈ ప్రాంతానికి హాట్ ఆజ్ హెల్ అని పేరు పెట్టారు. ఆ తర్వాతే ఇక్కడ ఈ ఊరు వెలిసింది. కానీ, గత యాభై ఏళ్లలో ఈ ప్రాంతంలో ఎక్కువ టెంపరేచర్ రికార్డ్ కాలేదు. సమ్మర్‌లో ఎక్కువలో ఎక్కువ 37 డిగ్రీలు, చలికాలంలో తక్కువలో తక్కువ -మైనస్ వన్ డిగ్రీల టెంపరేచర్ ఉంటోంది. ఆ లెక్కన ఈ ప్రాంతానికి ఈ పేరు కరెక్ట్ కాదని, మార్చాలని గవర్నమెంట్ ప్రయత్నించింది. కానీ, స్థానికులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
ఎగ్స్ అండ్ బేకన్
ఆస్ట్రేలియన్ స్టేట్ టాస్మానియాలోని ఒక ప్రాంతం పేరు ఇది. దీనికి ఈ పేరు రావడానికి కారణం ఈ ప్రాంతంలోని పూల చెట్లు. గుడ్డుపచ్చ సొన, బేకన్(డీప్ ఫ్రై మాంసం) కలర్‌లోని పువ్వుల్ని ‘ఎగ్స్ అండ్ బేకన్’ అని పిలుస్తారు. ఈ పేరు మీదనే ఆ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. అయితే 2006లో పెటా(PETA), ఇంటర్నెట్‌లో ఒక సైన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ప్రాంతం పేరు ‘యాపిల్ అండ్ చెర్రీ బే’గా మార్చాలని ఆ పిటిషన్‌లో కోరింది. అయితే అధికారులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు.
స్పా
బెల్జియంలోని లీగె ప్రావిన్స్‌లో ఉంది ఈ చిన్న టౌన్. ‘స్పా’ అనే పదం పుట్టింది ఇక్కడే. సహజమైన నీటి ఊటలు.. వాటిలో ఉండే మినరల్స్‌తో జబ్బులు నయం అవుతాయనేది అక్కడి ప్రజల నమ్మకం. ఒక్క ఆ ఊరివాళ్లకే కాదు.. ప్రపంచం మొత్తం ఆ నమ్మకం ఉంది. అందుకే ఇక్కడి నుంచి మినరల్ వాటర్‌ను విదేశాలకు ఎక్స్‌పోర్ట్ చేస్తుంటారు. ప్రపంచంలో తొలిసారి అఫీషియల్‌గా అందాల పోటీలు నిర్వహించింది కూడా ఈ టౌన్‌లోనే. పదివేల మంది జనాభా ఉండే ఈ ఊరు.. టూరిజం పరంగా కూడా బాగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. స్పా టౌన్ చరిత్ర కాలం ఎంతో కచ్చితంగా తెలియదు. కానీ, 14వ శతాబ్దం నుంచి ఇక్కడ ‘నీటి ఊటలతో నేచర్ ట్రీట్‌మెంట్’ మొదలైందని చెప్తుంటారు.
వెస్ట్‌వార్డ్ హో!
బ్రిటీష్ రైటర్ చార్లెస్ కింగ్‌స్లే 1885లో ‘వెస్ట్‌వార్డ్ హో!’ అనే పుస్తకం రాశాడు. ఒక కుర్రాడు ఫ్యామిలీ, ఇల్లు వదిలిపెట్టి అడ్వెంచర్స్ చేయడం ఈ బుక్ నేపథ్యం. ఈ టైంలో ఈ బుక్ ఎక్కువ కాపీలు అమ్ముడుపోయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఈ బుక్ క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని యూకేకి చెందిన రెండు కన్‌స్ట్రక్షన్ కంపెనీలు అనుకున్నాయి.
నార్తమ్ బురోస్ హోటల్, విల్లా బిల్లింగ్ కంపెనీలు కలిసి ఒక టౌన్ షిప్‌ను నిర్మించాయి. వెస్ట్‌వార్డ్ హో కథలోని లొకేషన్స్, సెట్టింగ్స్ మాదిరిగానే మొత్తం నిర్మాణాన్ని చేపట్టాయి ఆ కంపెనీలు. టౌన్‌షిప్‌కి ‘వెస్ట్‌వార్డ్ హో!’ అని పేరు పెట్టాయి. అలా ఒక ఫిక్షన్ ఊరు.. రియాల్టీ వరల్డ్‌లోకి వచ్చింది. ఇప్పటికీ ఆ ఊరి పేరు అలాగే ఉండిపోయింది.