ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న ప్రపంచ అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటాం.ఇది అక్షరాస్యత ప్రాముఖ్యతను తెలుపుతుంది. ఇది ప్రాథమిక హక్కుగా, వ్యక్తిగత, సామాజిక అభివృద్ధిలో కీలక భాగమని తెలియజేస్తుంది. 1967లో UNESCO ప్రారంభించబడింది. చదవడం, రాయడం ద్వారా వ్యక్తులను శక్తివంతం చేయడంలో ప్రపంచ రిమైండర్ గా పనిచేస్తుంది.
ఇటీవల కాలంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నా..విద్యా, ఉపాధి, వృద్ధి అవకాశాలకుదూరంగా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది ప్రజలు ఉన్నారు. ప్రభుత్వాలు, సంస్థలు, సంఘా లు కలిసి అక్షరాస్యత అంతరాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరికీ ఉజ్వల భవిష్యత్తును అందించే దిశగా ఇంటర్నేషనల్ లిటరసీ డే ప్రోత్సహిస్తుంది.
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం థీమ్..
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2024 సెప్టెంబర్ 8న నిర్వహించబడుతుంది. ఈ ఏడాది అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం థీమ్ ‘‘బహుభాషా విద్యను ప్రోత్సహించడం.. పరస్పరక అవగాహన, శాంతి కోసం అక్షరాస్యత’’
అంతర్జాతీయ అక్షర్యాసత దినోత్సవం 2024 ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భాషల సమన్వయంతో శాశ్వతమైన శాంతి సాధనకు ఉన్న సమస్యలపై దృష్టి పెడుతుంది యునెస్కో. చట్టాలు, ప్రోగ్రామ్స్, పాలన, జీవత కాల అభ్యసన వ్యవస్థలను మెరుగుపర్చేందుకు సాధ్యమైన సొల్యూషన్స్ ను అన్వేసిస్తుంది.
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం చరిత్ర, ప్రాముఖ్యత
1967 నుంచి ఇంటర్నేషన్ లిటరసీ డే ని యునెస్కో ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8 న జరుపుకుంటారు. అక్షరాస్యత అనేది అందరికీ ప్రాథమిక మానవ హక్కు. ఇది ఇతర మానవ హక్కులు, స్వేచ్ఛ,ప్రపంచ పౌరసత్వానికి తలుపులు తెరుస్తుంది. అక్షరాస్యత సమానత్వం , వివక్ష లేని గౌరవం, చట్ట నియమం, సంఘీభావం, న్యాయం ఆధారంగా శాశ్వత శాంతి సంస్కృతిని పొందేందుకు పునాది.