కేయూతో ‘నేచరోపతి’ అవగాహన ఒప్పందం

కేయూతో ‘నేచరోపతి’ అవగాహన ఒప్పందం

హసన్ పర్తి, వెలుగు :  కాకతీయ యూనివర్సిటీతో హనుమకొండలో ఇంటర్నేషనల్ నేచరోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్  అవగాహన ఒప్పందం చేసుకుంది. సోమవారం వర్సిటీ సెనెట్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో వీసీ కె. ప్రతాప్ రెడ్డి సమక్షంలో అవగాహన పత్రాలపై సంతకాలు  చేసినట్టు ఆచార్య గజ్జల రామేశ్వరం, రిజిస్ట్రార్  వి. రామచంద్రం వెల్లడించారు. 

 దేశంలోని 1,100  వర్సిటీలతో నేచరోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్‌‌ అగ్రిమెంట్ చేసుకోగా.. రాష్ట్రంలో కాకతీయ వర్సిటీ మొదటిదని పేర్కొన్నారు.  లైబ్రరీ సైన్స్, ఆర్ట్స్, లైఫ్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగ, సోషల్ సైన్సెస్ వంటి విభాగాల్లో పరిశోధనలకు విస్తృత అవకాశాలు కలుగుతాయని తెలిపారు. లైబ్రరీ వర్గీకరణ, కేటలాగింగ్ వంటి వాటిల్లో వర్సిటీ లైబ్రరీ సిబ్బంది భాగస్వామ్యం చేస్తారని చెప్పారు. ఇరు సంస్థల సమన్వయంతో సెమినార్లు, కాన్ఫరెన్సులు నిర్వహించే ఆలోచన ఉందని పేర్కొన్నారు. 

లైబ్రరీ సైన్స్ విద్యార్థులు, పరిశోధకులు, ఇంటర్నేషనల్ నేచరోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ వనరులను తమ పరిశోధనలకు వినియోగించుకోవచ్చని వివరించారు. కార్యక్రమంలో సైన్స్ విభాగాల డీన్  జి. హనుమంతు,  పరీక్షల నియంత్రణ అధికారి రాజేందర్ కట్ల,  ప్రిన్సిపాల్ ఆచార్య టి. మనోహర్, ఫార్మసీ విభాగాల డీన్  జి. సమ్మయ్య  అకాడమిక్ సెక్షన్ సహాయ రిజిస్ట్రార్ డా. శంకర్ కోలా పాల్గొన్నారు.