
‘జోహార్’ చిత్రంతో మంచి మార్కులు వేయించుకున్న దర్శకుడు తేజ మార్ని. ఈసారి ‘అర్జున ఫల్గుణ’ అంటూ వస్తున్నాడు. శ్రీవిష్ణు, అమృత అయ్యర్ జంటగా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 31న విడుదలవుతోంది. ఈ సందర్భంగా తేజ చెప్పిన విశేషాలు.‘‘మాది రాజమండ్రి కావడంతో మొదటి సినిమా తర్వాత నేను తీసే మూవీ కంప్లీట్‌గా గోదావరి
బ్యాక్‌డ్రాప్‌లోనే ఉండాలనుకున్నాను. సిటీలో ఉద్యోగం చేస్తే ఖర్చులు పోను మిగిలేది తక్కువే. అదే సొంతూళ్లోనే ఉంటే సంపాదన తక్కువైనా హ్యాపీగా గడిపేయొచ్చనుకునేవారు చాలామందే ఉన్నారు. వారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ స్క్రిప్ట్ రెడీ చేశాను. ఈస్ట్ గోదావరిలో ఫేమస్ డ్రింక్ అయిన ‘ఆర్టోస్’ అనే టైటిల్ పెట్టాలనుకున్నాం. కానీ ఆ కంపెనీ వారు ఒప్పుకోలేదు. ఈ టైటిల్ లేకపోతే కథ మార్చాలని విష్ణు, నేను ఆలోచిస్తున్న టైమ్‌లో పిడుగులు పడ్డాయి. దాంతో ‘అర్జున ఫల్గుణ’ టైటిల్ తట్టింది. శ్రీవిష్ణు క్యారెక్టర్ పేరు అర్జున్ అని ముందే ఫిక్స్ చేయడంతో కరెక్ట్‌గా సూటవుతుందని కూడా అనిపించింది.
టైటిల్‌కి తగ్గట్టుగా స్టోరీ స్పాన్ పెంచి యాక్షన్ సీన్స్ వంటివి యాడ్ చేశాం. ఊళ్లో ఉన్నంతసేపు అర్జునుడిగా ఉన్నవాడు ఊరు దాటి వచ్చాక ఫల్గుణుడిగా ఎలా మారాడనేది కథ. ‘సిందూరం’ సినిమాలో రవితేజను చూసిన ఫీలింగ్ కలుగుతుంది ఇందులో శ్రీవిష్ణుని చూస్తే. అర్జున్, రాంబాబు, తాడోడు, ఆస్కార్, శ్రావణి అనే ఐదు క్యారెక్టర్స్ చుట్టూ సినిమా తిరుగుతుంది. వీరి పేర్లలోని మొదటి అక్షరాలను బేస్ చేసుకుని వీరికి సినిమాలో ఆర్టోస్ బ్యాచ్ అనే పేరు పెట్టాం. హీరోయిన్ అమృత అయ్యర్ ట్రెమండస్ ఆర్టిస్ట్. తనకి గ్రామ వాలంటీర్ పాత్ర ఇవ్వడంతో కొంతమంది కాంట్రవర్సీ చేస్తున్నారు. కానీ గొడవ చేసేంత నెగిటివ్ విషయాలేమీ సినిమాలో లేవు. ఫస్టాఫ్ అంతా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. సెకెండాఫ్‌లో యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో అందరూ కచ్చితంగా ఎమోషనల్ అవుతారనుకుంటున్నా. దర్శకుడిగా నా బలం ఎమోషన్ అని నమ్ముతాను. అది ఉంటేనే సినిమాని గుర్తు పెట్టుకుంటారు. ప్రస్తుతం కొన్ని కమిట్‌మెంట్స్ ఉన్నాయి. త్వరలోనే అనౌన్స్‌మెంట్స్ వస్తాయి.’’