కమెడియన్ సత్య లీడ్ రోల్‌లో రితేష్ రానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘జెట్లీ’. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఆకట్టుకున్న మేకర్స్.. బుధవారం హీరోయిన్‌ను రివీల్ చేశారు.
మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా ఈ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందని తెలియజేశారు. ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ఆమె చేతిలో గన్‌తో యాక్షన్ అవతార్‌లో స్టైలిష్‌గా కనిపిస్తోంది. వెన్నెల కిషోర్, అజయ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.
►ALSO READ | సోషల్ మీడియా ఉందని ట్వీట్లు వేయాలా: అఖండ 2 వల్లే నీ సినిమా తెలుస్తుంది.. డైరెక్టర్ మారుతి కామెంట్స్

