తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా కొత్త దర్శకుడు భరత్ దర్శన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ..! సుకుమారి’. గంగా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. ఇప్పటికే దామిని పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన మేకర్స్, ఇప్పుడు తిరు వీర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో తిరువీర్‌ను యాదగిరి పాత్రలో పల్లెటూరి యువకుడిగా మాసివ్ లుక్‌లో చూపించిన తీరు ఆకట్టుకుంది.
లుంగీ, బనియన్, మెడపై టవల్‌తో నోట్లో టూత్ బ్రష్ పెట్టుకుని విలేజ్‌లో నడుచుకుంటూ ఫస్ట్ లుక్ పోస్టర్‌తోనే తన క్యారెక్టర్‌పై క్యూరియాసిటీని పెంచాడు. ఝాన్సీ, మురళీధర్ గౌడ్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
