ఐఎన్టీయూసీతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం: యూనియన్ ఆల్ ఇండియా సీనియర్ సెక్రటరీ బాబర్ సలీంపాష

ఐఎన్టీయూసీతోనే ఉద్యోగుల సమస్యల పరిష్కారం: యూనియన్ ఆల్ ఇండియా సీనియర్ సెక్రటరీ బాబర్ సలీంపాష

గోదావరిఖని, వెలుగు: కాంగ్రెస్​అనుబంధ ఐఎన్టీయూసీతోనే రామగుండం ఎన్టీపీసీలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని యూనియన్​ ఆల్​ ఇండియా సీనియర్​ సెక్రటరీ, ఎన్టీపీసీ నేషనల్​మజ్దూర్​ యూనియన్​ లీడర్, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీ మెంబర్​బాబర్​సలీంపాష తెలిపారు. ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని యూనియన్​ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత నెల 4న ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జేపీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగుల సమస్యలపై చర్చించామన్నారు. ఎన్టీపీసీలో మ్యాన్ పవర్ తగ్గడంతో ఉన్న ఉద్యోగులపై భారం పడుతోందని, కొత్తగా ఉద్యోగాలు భర్తీ చేయాలని మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిమాండ్ ​చేశామని, దీనికి అధికారులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు.

ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీసీలో తక్కువ సభ్యత్వం ఉన్న బీఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని, ఐఎన్టీయూసీ మాత్రమే ఉద్యోగుల డిమాండ్లను సాధిస్తుందన్నారు. ఉద్యోగులకు తమ యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై విశ్వాసం ఉందని, ఈ నెల 25న జరగనున్న ఉద్యోగ గుర్తింపు ఎన్నికల్లో మజ్దూర్​యూనియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యూనియన్​ లీడర్లు కిష్టయ్య, ఆరేపల్లి రాజేశ్వర్, సువర్తన్ రావు, మణికంఠ, రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కందుల స్వామి, చందర్​, భాస్కర్, చిన్నయ్య, సత్యనారాయణగౌడ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.