పాక్ గెలవాలంటే స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ కావాలి..

పాక్ గెలవాలంటే స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ కావాలి..

ఆసియాకప్ లో పాక్పై భారత్ అద్బుతమైన విజయం సాధించింది. భారత్ గెలుపులో కోహ్లీ 35 పరుగులు, జడేజా 35 పరుగులు, పాండ్యా 33 పరుగులు చేసి కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్‌లో 35పరుగులు చేసిన  కోహ్లీపై  పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ విమర్శలు గుప్పించాడు. పాక్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ తీవ్రమైన ఒత్తిడితో కన్పించాడని చెప్పుకొచ్చాడు. సాధారణంగా సెట్ బ్యాటర్‌ను ఔట్ చేయడం  కష్టమైనదని... అయితే సెట్ అయ్యాక కూడా కోహ్లీ ఏమాత్రం కాన్ఫిడెంట్‌గా ఆడలేదన్నాడు.  కోహ్లీని అలా చూసి తాను ఆశ్చర్యపోయానన్నాడు.  కోహ్లీ అడపాదడపా బౌండరీలు కొట్టినా..గతంలో మాదిరి అగ్రెసివ్ అప్రోచ్ చూపించలేదని తెలిపాడు.  షాట్ సెలక్షన్లో కూడా  తడబడ్డాడని చెప్పాడు. పదే పదే బంతి ఎడ్జ్ అయి స్టంప్‌లను మిస్సయిందన్నాడు.

ఇండియా బాగా ఆడింది...
తుది జట్టు నుంచి రిషబ్ పంత్ను తప్పించడం సరైంది కాదని ఇంజమామ్ అన్నాడు. మిడిలార్డర్లో రిషబ్‌ పంత్‌ను బెంచ్‌కు పరిమితం చేయడం తతను ఆశ్చర్యపరిచిందని చెప్పాడు.  పంత్, పాండ్యా, జడేజా ..ఈ ముగ్గురి కాంబినేషన్ చాలా డేంజరెస్‌గా ఉంటుందని తెలిపాడు. కానీ పంత్‌ను ఎందుకు పక్కన పెట్టారో మాత్రం అర్థం కాలేదన్నాడు.  ఏదేమైనా భారత్ బాగా ఆడిందని ఇంజమామ్ పేర్కొన్నాడు.

పాకిస్థాన్కు సూచనలు..
పాకిస్తాన్ సెలక్షన్ కమిటీకి ఇంజమామ్ పలు సూచనలు చేశాడు. ఆ జట్టులో నాలుగు, ఐదు స్థానాలకు స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ను కనుగొనాలని కోరాడు. పాక్ సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్‌మెంట్ పాక్ మిడిల్ ఆర్డర్ బలపడ్డానికి ఏదైనా చేయాలన్నాడు. నంబర్ 3 బ్యాటర్ ఫాఖర్ జమాన్ అవుటయ్యాక జట్టు కుప్పకూలుతుందని..అందుకే  పాక్‌కు నం.4, నం.5 స్థానాలకు నిఖార్సైన బ్యాటర్లు అవసరమని అభిప్రాయపడ్డాడు. లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ఆసిఫ్ అలీ, ఖుష్దిల్ షా బాగా సరిపోతారన్నారు.