లేడీ ఫ్యాన్స్ ఉన్నారని ఐపీఎల్ ప్రసారాలపై బ్యాన్

లేడీ ఫ్యాన్స్ ఉన్నారని ఐపీఎల్ ప్రసారాలపై బ్యాన్

కాబూల్: తాలిబాన్లు మరోసారి తమ పాలన ఎలా ఉంటుందో నిరూపించుకున్నారు. ప్రజల హక్కులను తొక్కిపెడుతూ పాలిస్తున్న తాలిబాన్లు.. వారి స్వేచ్ఛను కూడా హరిస్తున్నారు. కనీసం తమకు ఇష్టమైన ఆటలను కూడా చూడకుండా నిషేధాలు విధిస్తున్నారు. వివరాలు.. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 14వ సీజన్ ఫేజ్ 2 ప్రసారాలపై అఫ్గానిస్థాన్‌లోని తాలిబాన్ల ప్రభుత్వం బ్యాన్ విధించింది. మ్యాచ్ టైమ్‌లో స్టేడియంలో మహిళా ప్రేక్షకులు ఉన్నందున ప్రసారాలపై నిషేధం వేయాలని తాలిబాన్లు నిర్ణయించారు. 

‘అఫ్గానిస్థాన్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రసారాలపై తాలిబాన్లు బ్యాన్ విధించారు. ఐపీఎల్ జరుగుతున్న స్టేడియాల్లో మహిళా ప్రేక్షకులు ఉండటం, వారిలో పలువురు డ్యాన్స్ చేస్తున్నారనే కారణంతో మ్యాచ్‌లను ప్రసారం చేయొద్దని అఫ్గాన్ మీడియా సంస్థలకు తాలిబాన్లు హెచ్చరికలు జారీ చేశారు’ అని అఫ్గాన్ జర్నలిస్టు ఫవాద్ అమన్ ట్వీట్ చేశారు. కాగా, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగానికి సంబంధించిన పలు ప్రసారాలు, కార్యక్రమాలపై తాలిబాన్లు నిషేధం విధించారు. వీటిలో పలు ఆటలు ఉన్నాయి. మహిళలు ఏ ఆటలు కూడా ఆడకుండా పూర్తిగా బ్యాన్ వేశారు. అయితే పురుషులు క్రికెట్ ఆడితే తమకు అభ్యంతరం లేదని.. రాజధాని కాబూల్ నుంచి విదేశీ శక్తులు పూర్తిగా వైదొలిగాక వారికి మ్యాచులు ఆడుకునేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. 

Read More:

కన్యా దానం: దానమిచ్చేందుకు నేనేమైనా వస్తువునా?

వైట్ ఛాలెంజ్ ప్రకంపనలు.. అసలు దీని హిస్టరీ ఏంటి?

వైరల్ వీడియో: స్టాలిన్ సీక్రెట్ అడిగిన మహిళ.. సిగ్గుపడుతూ చెప్పిన సీఎం

ఆర్మీ హెలికాప్టర్ కూలి.. ఇద్దరి మృతి

ఆ స్వామీజీది హత్యా? ఆత్మహత్యా?