అంబరాన్నంటేలా ఐపీఎల్​ ముగింపు వేడుకలు

అంబరాన్నంటేలా ఐపీఎల్​ ముగింపు వేడుకలు

మే 28న ఆదివారం చెన్నై సూపర్​ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య తుది సమరం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్కంఠభరిత పోరు ప్రారంభానికి ముందు ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖ రాపర్లు ఇందులో ప్రదర్శన ఇవ్వనున్నారు. అంతేకాదు ఈ ముగింపు వేడుకల్లో ప్రముఖ సంగీతకారుడు ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ప్రదర్శన కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్‌ ప్రారంభం కానుంది. 

మ్యాచ్‌ ప్రారంభానికి ముందు ర్యాపర్ కింగ్, మ్యూజిక్ డైరెక్టర్ న్యూక్లియా అభిమానులను అలరించనుండగా, తొలి ఇన్నింగ్స్ ముగిశాక జోనితా గాంధీ, డివైన్ జోడీ ప్రదర్శన ఉండనున్నట్లు తెలుస్తోంది. వీక్షకులు.. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఐపీఎల్ ముగింపు వేడుకల ప్రత్యక్ష ప్రసారాలను చూడవచ్చు. అలాగే డిజిటిల్‌ యాప్ అయిన జియో సినిమాలో కూడా ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు.

https://twitter.com/IPL/status/1661997184815108097

https://twitter.com/IPL/status/1662015887334060032