
ముంబై: హోరాహోరీగా సాగుతున్న ఐపీఎల్16 సీజన్‌లో లీగ్ దశ చివరి రోజు వరకూ ప్లేఆఫ్స్ బెర్తులు పూర్తిగా తేలలేదు. టాప్3లో నిలిచిన గుజరాత్, చెన్నై, లక్నో టోర్నీలో ముందుకెళ్లగా.. కేకేఆర్, రాజస్తాన్ నాకౌటయ్యాయి. ప్లేఆఫ్స్‌లో నాలుగో బెర్తు కోసం ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ పోటీ పడుతున్నాయి. ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్‌తో ముంబై, టాపర్ గుజరాత్ టైటాన్స్‌తో ఆర్‌సీబీ తమ హోమ్‌గ్రౌండ్స్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ప్రస్తుతం ఇరు జట్లూ చెరో 14 పాయింట్లతో ఉన్నప్పటికీ మంచి రన్‌రేట్‌తో ఆర్‌సీబీ (0.180) నాలుగో ప్లేస్‌లో ఉండగా.. ముంబై (–0.128) ఆరో ప్లేస్‌లో నిలిచింది. ఈ నేపథ్యంలో రెండు జట్లలో ఒకటి గెలిచి, మరోటి ఓడితే.. నెగ్గిన జట్టు 16 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్ చేరుతుంది. ఒకవేళ ఇరు జట్లూ గెలిస్తే అప్పుడు రన్‌రేట్ కీలకం అవుతుంది. మెరుగైన రన్‌రేట్ ఉంది కాబట్టి జీటీపై నెగ్గితే ఆర్‌సీబీ డైరెక్ట్‌గా ప్లేఆఫ్స్ చేరనుంది. ముంబై ముందుకెళ్లాలంటే సన్‌రైజర్స్‌పై భారీ తేడాతో నెగ్గాల్సి ఉంటుంది.