IPL 2024 Auction: దుబాయి గడ్డపై ఐపీఎల్ 2024 వేలం.. ఎప్పుడంటే..?

IPL 2024 Auction: దుబాయి గడ్డపై ఐపీఎల్ 2024 వేలం.. ఎప్పుడంటే..?

సస్పెన్స్‌కు భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ) తెరదించింది. ఐపీఎల్ వేలం ఎప్పుడు? ఎక్కడ..? అనే దానిపై స్పష్టతనిచ్చింది. నవంబర్ 19న దుబాయిలోని కోకా-కోలా అరేనా వేదికగా ఐపీఎల్ వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. అలాగే, ఫ్రాంచైజీలు ప్లేయర్ రిటెన్షన్ జాబితాను ప్రకటించడానికి నవంబర్ 26వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది.

రూ.100 కోట్లు

గత సీజన్‌లో ఫ్రాంచైజీల పర్స్‌ వాల్యూ రూ. 95 కోట్లు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.100 కోట్లకు పెంచుతూ ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆటగాళ్లు మరింత సంపాదించుకోవచ్చు.

ఏ ఫ్రాంచైజీ పర్స్‌లో ఎంత  ఉందంటే?

ప్రస్తుతం అత్యధికంగా పంజాబ్ కింగ్స్ ఖాతాలో 12.20 కోట్లు ఉండగా, అత్యల్పంగా ముంబై ఇండియన్స్ ఖాతాలో రూ.5 లక్షలు మిగిలి ఉన్నాయి.

  • పంజాబ్‌ కింగ్స్‌- రూ. 12.20 కోట్లు
  • సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- రూ. 6.55 కోట్లు
  • ఢిల్లీ క్యాపిటల్స్‌- రూ.4.45 కోట్లు
  • లక్నో సూపర్‌ జెయింట్స్‌- రూ.3.55 కోట్లు
  • రాజస్తాన్‌ రాయల్స్‌- రూ.3.55 కోట్లు
  • రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు- రూ.1.75 కోట్లు
  • కోల్‌కతా నైట్‌రైడర్స్‌- రూ. 1.65 కోట్లు
  • చెన్నై సూపర్‌ కింగ్స్‌- రూ. 1. 5 కోట్లు
  • ముంబై ఇండియన్స్‌- రూ. 0.05 కోట్లు  

ALSO READ | IPL 2024 Auction: వేట మొదలుపెట్టిన ముంబై.. 7 కోట్ల ఆటగాడిని 50 లక్షలకు కొనేసింది