సులభంగా డెత్ క్లెయిమ్ లు చేయడానికి ఐడియాలు ఇవ్వాలని కోరిన ఐఆర్​డీఏఐ  

సులభంగా డెత్ క్లెయిమ్ లు చేయడానికి ఐడియాలు ఇవ్వాలని కోరిన ఐఆర్​డీఏఐ  

న్యూఢిల్లీ : పాలసీదారుడు మరణిస్తే త్వరగా పరిహారం చెల్లించేలా ‘ఆటోమేటెడ్​ డెత్​క్లెయిమ్​ సెటిల్​మెంట్​’ అమలు చేయడానికి ఐడియాలు ఇవ్వాలని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్​డీఏ) కోరింది. ఇందుకోసం చేపట్టిన మొదటి హ్యాకథాన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా దరఖాస్తులను ఆహ్వానించింది. హ్యాకథాన్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ మంగళవారం నుంచి ప్రారంభమయిందని రెగ్యులేటరీ ఏజెన్సీ తెలిపింది.

పాలసీదారుల ప్రయోజనాలను కాపాడే లక్ష్యంతో ఆటోమేటెడ్ డెత్ క్లెయిమ్ సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్, మిస్ సెల్లింగ్‌‌‌‌‌‌‌‌ను తగ్గించడం, ఇన్సూరెన్స్​ ఎకోసిస్టమ్​లోని ఇతర రంగాల కోసం టెక్నాలజీతో నడిచే కొత్త విధానాలను అభివృద్ధి చేయడానికి, బీమా మోసాలను తగ్గించడానికి ఐడియాలను ఇవ్వాలని కోరింది. బీమా మంథన్ 2022లో భాగంగా- 'ఇన్నోవేషన్ ఇన్ ఇన్సూరెన్స్' థీమ్‌‌‌‌‌‌‌‌తో దరఖాస్తులను ఆహ్వానించింది. టెక్నాలజీ తో ప్రతి వ్యక్తికి సమర్థంగా, వేగంగా బీమాను అందుబాటులోకి తేవడానికే ఈ ప్రయత్నమని ప్రకటించింది.