
న్యూఢిల్లీ: ఇక నుంచి మీరు మీ హెల్త్, మోటార్, ఇతర ఇన్సూరెన్స్ పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో కొనుగోలు చేసుకోవచ్చు. హార్డ్ కాపీపై సంతకం చేయాల్సినవసరం లేకుండా వన్ టైమ్ పాస్‌వర్డ్‌తో ఇన్సూరర్ వద్ద మీరు ఇన్సూరెన్స్ పాలసీని పొందవచ్చు. ఎలక్ట్రానిక్‌గా పాలసీలను జారీ చేసేందుకు మోటార్, హెల్త్ ఇన్సూరర్లకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) అనుమతి ఇచ్చింది. ఈ నెల 10న ఐఆర్‌డీఏఐ జారీ చేసిన ఈ సర్క్యూలర్, 2021 మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. కరోనా వైరస్ కారణంతో, అంతకుముందు కొన్నట్టు ఇన్సూరెన్స్ పాలసీలను కొనడం కుదరడం లేదు. ఫిజికల్ ఫామ్‌లో ఇన్సూరెన్స్ పాలసీలను కంపెనీలు జారీ చేయలేకపోతున్నాయి. ఫిజికల్ ప్రపోజల్ ఫామ్‌లను నింపడం, వాటిపై పాలసీదారుల సంతకం పెట్టించుకోవడం వంటివి కరోనా దెబ్బకు బాగా ప్రభావితమయ్యాయి. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఐఆర్‌డీఏఐ సర్క్యూలర్ ప్రకారం ఎలక్ట్రానిక్ పాలసీలను జారీ చేయడం ఇండస్ట్రీకి పాజిటివ్ గా నిలుస్తుందని బజాజ్ ఎలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ రిటైల్ అండర్‌రైటింగ్ హెడ్ గుర్దీప్ సింగ్ బాత్రా అన్నారు. ఫిజికల్ పాలసీ డాక్యుమెంట్లను లేదా ప్రపోజల్ ఫామ్‌లను ఇబ్బందిగా ఉందన్నారు. ఎలక్ట్రానిక్ విధానం తీసుకురావడం కేవలం ఇన్సూరెన్స్ పాలసీల జారీలో ఉపయోగపడటమే కాకుండా.. సురక్షితంగా పాలసీ డాక్యుమెంట్లను జారీ చేయొచ్చని తెలిపారు. అన్ని డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌గా ట్రాన్సాక్షన్ అయి, ఇన్సూరర్‌కు, పాలసీహోల్డర్‌కు మధ్య పారదర్శకతను పెంచుతుందని చెప్పారు. ఐఆర్‌డీఏఐ ప్రస్తుతం తీసుకున్న ఈ నిర్ణయం స్వాగతించదగినదని పాలసీబజార్ హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ అమిత్ బాబ్రా తెలిపారు. తక్కువ టైమ్‌లోనే కస్టమర్లకు ఇన్సూరెన్స్ పాలసీలను జారీ చేయొచ్చన్నారు
ఎలక్ట్రానిక్‌గా పాలసీలను జారీ చేస్తున్నప్పుడు
కంపెనీలు పాటించాల్సిన నియమాలు…
- ఇన్సూరర్లు పాలసీ డాక్యుమెంట్లను, ఫిజికల్ ఫామ్ కాపీని డిజిటల్‌గా లేదా ఎలక్ట్రానిక్ విధానంలో పంపించాల్సి ఉంటుంది. కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈ–మెయిల్‌కే డాక్యుమెంట్లను పంపాలి.
- ఇదే సమయంలో పాలసీ హోల్డర్స్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా పాలసీ డాక్యుమెంట్లను పంపిన విషయాన్ని తెలియజేయాలి.
- ఎలక్ట్రానిక్‌గా పంపిన పాలసీ డాక్యుమెంట్‌లో అన్ని షెడ్యూల్స్, టర్మ్స్, కండీషన్స్, బెనిఫిట్స్‌ను వివరించాలి.ఎలక్ట్రానిక్‌గా డాక్యుమెంట్లు పంపిన తర్వా త, పాలసీ హోల్డర్‌కు డాక్యుమెంట్లు పంపిన విషయాన్ని సిస్టమాటిక్‌గా రికార్డు చేయాలి.
- కరోనా మహమ్మారితో ఫిజికల్ పాలసీ డాక్యుమెంట్‌ను ప్రింట్ చేయడం, పంపడం ఆలస్యమవుతుందనే విషయాన్ని పాలసీ హోల్డర్స్‌కు తెలియజేయాలి.
- ఎలక్ట్రానిక్‌గా పంపిన పాలసీ డాక్యుమెంట్ వాలిడ్ అనే విషయాన్ని పాలసీ హోల్డర్స్‌కు చెప్పాలి