నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా

నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా

కాశీబుగ్గ/ ఖిలా వరంగల్​ (మామునూరు), వెలుగు: వరంగల్​ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం వరంగల్​ తూర్పు నియోజకవర్గంలోని 21, 26వ డివిజన్లలో సీసీ రోడ్డు, డ్రైన్స్, కాశీబుగ్గ అర్బన్​ప్రైమరీ హెల్త్ సెంటర్​ బిల్డింగ్ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. అంతకుముందు హనుమకొండలోని రామ్ నగర్ లో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

 పలు సమస్యలను అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. వరంగల్​ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహ్మద్​ ఆయూబ్​ తల్లి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, శనివారం రాత్రి ఆయూబ్​ ఇంటికి మంత్రి కొండా సురేఖ వెళ్లి పరామర్శించారు. ఇదిలా ఉండగా, వరంగల్, హనుమకొండ జిల్లాల మధ్య ఉన్న అమ్మవారిపేట సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధికి సహకరించాలని జాతర కమిటీ సభ్యులు మంత్రి కొండా సురేఖను కోరారు. కమిటీ ఆర్గనైజర్​ దాసి రాందేవ్​ ఆధ్వర్యంలో ఏర్పాట్లకు సహకరించాలని వినతి పత్రం అందజేశారు. స్పందించిన మంత్రి వెంటనే అధికారులకు ఆదేశాలిచ్చారు. ​