
యాదగిరిగుట్ట, వెలుగు: సమాజానికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, చిన్నారులకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘స్వస్త్ నారీ స్వశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చిందని రాష్ట్ర పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. మహిళల ఆరోగ్య లక్ష్యంగా రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. డీఎంహెచ్ఓ డాక్టర్ మనోహర్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పావని, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.