శాంసన్‌‌‌‌కు టెన్షన్‌‌‌‌! .. రాణించకపోతే టీమ్‌‌‌‌లో ప్లేస్‌‌‌‌ కష్టమే

శాంసన్‌‌‌‌కు టెన్షన్‌‌‌‌! .. రాణించకపోతే  టీమ్‌‌‌‌లో ప్లేస్‌‌‌‌ కష్టమే

డబ్లిన్‌‌‌‌:  స్పీడ్‌‌‌‌ స్టర్‌‌‌‌ జస్‌‌‌‌ప్రీత్‌‌‌‌ బుమ్రా కెప్టెన్సీలో యంగ్‌‌‌‌స్టర్లతో కూడిన టీమిండియా చిన్న జట్టు ఐర్లాండ్‌‌‌‌తో టీ20 పోటీకి రెడీ అయింది. గాయం నుంచి కోలుకున్న బుమ్రా ఈ సిరీస్‌‌‌‌తోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రెగ్యులర్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యాతో పాటు సీనియర్లు రెస్ట్ తీసుకోవడంతో ఈ సిరీస్​లో యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌కు మరిన్ని అవకాశాలు రానున్నాయి. ఈ లెక్కన రీఎంట్రీ ఇస్తున్న బుమ్రా, తిలక్‌‌‌‌ వర్మ, రింకూ సింగ్‌‌‌‌ లాంటి యంగ్‌‌‌‌స్టర్లపైనే ఇప్పుడు  అందరి దృష్టి ఉండాలి. కానీ, వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌ సంజు శాంసన్‌‌‌‌పై ఎక్కువగా ఫోకస్‌‌‌‌ ఉండనుంది. ఐపీఎల్‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌కు కెప్టెన్‌‌‌‌గా హిట్టయిన శాంసన్‌‌‌‌ టీమిండియాలో మాత్రం తన టాలెంట్‌‌‌‌కు తగ్గట్టు ఆడటం లేదు.  అతనికి సరైన అవకాశాలు ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తుండగా.. ఇచ్చిన చాన్స్‌‌‌‌లను సంజు సద్వినియోగం చేసుకోవడం లేదు. విండీస్‌‌‌‌తో వన్డే, టీ20 సిరీస్‌‌‌‌లో తను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.  అయినా అతని విషయంలో ఓపిక చూపెడుతున్న సెలెక్టర్లు ఐర్లాండ్‌‌‌‌తో టీ20లకూ ఎంపిక చేశారు. అయితే, ఈ సిరీస్‌‌‌‌ శాంసన్‌‌‌‌కు చావోరేవో కానుంది. ఇప్పటికే ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ తన టాలెంట్‌‌‌‌ చూపెట్టగా, ఐపీఎల్‌‌‌‌లో మెరిసిన మరో కీపర్‌‌‌‌, బ్యాటర్‌‌‌‌ జితేశ్‌‌‌‌ శర్మ టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడంతో శాంసన్‌‌‌‌కు టెన్షన్‌‌‌‌ మొదలైంది. విండీస్‌‌‌‌తో టీ20 సిరీస్‌‌‌‌లో మూడు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో 12, 7, 13 స్కోర్లతో  ఫెయిలైన సంజు కష్టాలను కొని తెచ్చుకున్నాడు. శుక్రవారం జరిగే తొలి టీ20లో జితేశ్‌‌‌‌ కీపర్‌‌‌‌గా వచ్చినా ఆశ్చర్యం లేదు. ఆసియా గేమ్స్‌‌‌‌లో ఆడే ఇండియా టీమ్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ చాయిస్‌‌‌‌ కీపర్‌‌‌‌గా ఉన్న జితేశ్‌‌‌‌ టీమ్‌‌‌‌లో సెటిల్‌‌‌‌ అయ్యేందుకు కొన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌‌‌‌మెంట్ భావిస్తోంది. ఐపీఎల్‌‌‌‌లో పంజాబ్‌‌‌‌ కింగ్స్‌‌‌‌ తరఫున 5, 6వ స్థానాల్లో వచ్చి జితేశ్‌‌‌‌ కష్టమైన ఫినిషర్‌‌‌‌ పాత్రను బాగానే నిర్వర్తించాడు. 

కేఎల్‌‌‌‌ రాకపోతే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ వరకు..

కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ పూర్తి ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ సాధించకపోతే వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ వరకు శాంసన్‌‌‌‌ రిజర్వ్‌‌‌‌ కీపర్‌‌‌‌గా టీమ్‌‌‌‌లో ఉండే చాన్సుంది. అయితే,  నిలకడలేమి జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. టాలెంట్‌‌‌‌ ఉన్నప్పటికీ దాన్ని గ్రౌండ్‌‌‌‌లో చూపెట్టకపోవడం సెలెక్టర్లకూ తలనొప్పిగా మారింది. ప్రస్తుతానికైతే ఫార్మాట్‌‌‌‌తో సంబంధం లేకుండా  వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌  వరకు శాంసన్‌‌‌‌కు కొన్ని అవకాశాలు ఇవ్వాలని మేనేజ్‌‌‌‌మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అదే టైమ్‌‌‌‌లో యంగ్‌‌‌‌ స్టర్‌‌‌‌ జితేశ్​నూ పరీక్షించాల్సిన నేపథ్యంలో తుది జట్టులో ఇద్దరు కీపర్లకు చోటు ఉంటుందా? అన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఈ సిరీస్‌‌‌‌లో ఓపెనర్లుగా రుతురాజ్, యశస్వి జైస్వాల్‌‌‌‌, నాలుగో నంబర్‌‌‌‌లో నయా సెన్సేషన్‌‌‌‌ తిలక్‌‌‌‌ వర్మకు ప్లేస్‌‌‌‌ ఖాయమే. సూర్యకుమార్‌‌‌‌ గైర్హాజరీలో మూడో నంబర్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ ఖాళీగా ఉంది. ఐపీఎల్‌‌‌‌లో రాజస్తాన్‌‌‌‌ తరఫున పలు సందర్భాల్లో మూడో నంబర్‌‌‌‌లో ఆడిన శాంసన్‌‌‌‌ను ఆడించే చాన్స్‌‌‌‌ కనిపిస్తున్న యంగ్‌‌‌‌ హిట్టర్‌‌‌‌ శివం దూబే నుంచి పోటీ ఉంది. దూబే సీమ్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ కావడంతో తుది జట్టులో అతనికి మొగ్గు ఉంటుంది. మరోవైపు జితేశ్‌‌‌‌తో పాటు ఐపీఎల్‌‌‌‌ స్టార్‌‌‌‌ రింకూ సింగ్‌‌‌‌ కూడా అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నాడు.  ఈ నేపథ్యంలో శాంసన్‌‌‌‌ ఈ సిరీస్​లో  కచ్చితంగా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. లేదంటే మున్ముందు కుర్రాళ్లకు దారి వదలాల్సి ఉంటుంది. 

నెట్స్‌‌‌‌లో  బుమ్రా జోరు

గాయాల వల్ల దాదాపు 11 నెలలు ఇబ్బంది పడ్డ  పేసర్‌‌‌‌ బుమ్రా రీఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. ఐర్లాండ్‌‌‌‌తో శుక్రవారం నుంచి జరిగే సిరీస్‌‌‌‌ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. బుధవారం జరిగిన నెట్‌‌‌‌ సెషన్‌‌‌‌లో బుమ్రా పూర్తిస్థాయిలో బౌలింగ్‌‌‌‌ చేశాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్‌‌‌‌కు బౌన్సర్‌‌‌‌, లెఫ్టాండ్‌‌‌‌ బ్యాటర్లకు తన మార్కు యార్కర్‌‌‌‌ వేశాడు.