క‌ళ్లు భైర్లు క‌మ్మే కండిషన్స్: సందీప్ రెడ్డి వంగా హర్ట్.. స్పిరిట్ నుంచి దీపికా పదుకొనే అవుట్!

క‌ళ్లు భైర్లు క‌మ్మే కండిషన్స్: సందీప్ రెడ్డి వంగా హర్ట్.. స్పిరిట్ నుంచి దీపికా పదుకొనే అవుట్!

సందీప్‌‌‌‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘స్పిరిట్’(Spirit).ఇందులో ప్రభాస్ కు జోడిగా దీపికా పదుకునే నటిస్తున్నట్లు గతకొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. దీపికా పదుకొనేను సందీప్ రెడ్డి వంగా తొలగించినట్లు సమాచారం. ఇందులో నటించడానికి దీపికా డిమాండ్లు క‌ళ్లు భైర్లు క‌మ్మేలా ఉండటంతో సందీప్ రెడ్డి ఈ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ తో దీపికా పదుకొనే కలిసి పనిచేస్తారని రెబల్ ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా, ఆమె డిమాండ్లపై తలెత్తిన ఘర్షణల కారణంగా ఇకపై స్పిరిట్ లో భాగం కాదని అనేక సంస్థలు వెల్లడించాయి. 

దీపికా పదుకునే డిమాండ్స్:

స్పిరిట్ సినిమా కోసం దీపికా పదుకునే మొదటిది, రూ.20కోట్ల రెమ్యునరేషన్ను డిమాండ్ చేసిందని సమాచారం. మేకర్స్ కూడా అంతమొత్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉండగా.. తాను నటించడానికి మరిన్ని కండిషన్స్ పెట్టిందట.

Also Read :  ఆఫిషియల్.. ‘ఆదిపురుష్’తర్వాత ‘కలాం’బయోపిక్తో ఓం రౌత్ సాహసం

రెండవది, రూ.20కోట్ల రెమ్యునరేషన్ తో పాటు పెద్ద మొత్తంలో షేర్‌ని డిమాండ్ చేసిందట. మూడోది, 8 గంటలు మాత్రమే సెట్ లో పనిచేయడానికి ఒప్పుకుందట. అయితే, ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఉన్న 8 గంటల్లో అందులో 2 గంటలు జర్నీకే పోతుంది. ఇక మిగిలింది 6 గంటలు మాత్రమే. ఇలా 6 గంటలు మాత్రమే సెట్స్ లో ఉంటానని చెప్పిందట.

చివరగా, తెలుగులో తన డైలాగ్స్ అందించడానికి నిరాకరించిందని, భాష తెలియదని చెప్పేసిందట. ఇక దీపిక కండీష‌న్స్‌కి బాగా హర్ట్ అయిన డైరెక్టర్ సందీప్ రెడ్డి.. తన స్థానంలో మరో హీరోయిన్ ను తీసుకోవడానికి వేటలో పడ్డాడట.

సందీప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్ మెంట్ తోనే అంచనాలు పెరిగిపోయాయి. 'యానిమల్' మూవీలో సందీప్ డైరెక్షన్కి వందకి వంద మార్కులు పడ్డాయి. రణ్ బీర్ చూపించిన విధానంకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

అలాంటి ప్రభాస్ని ఎలా చూపించబోతున్నాడనే క్యూరియాసిటీ అందరిలో పెరిగింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఏక్షణమైనా ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని టి సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.