ప్రపంచం అంతం అవుతుందని జుకర్‌బర్గ్ లాంటి టెక్ దిగ్గజాలు డిసైడ్ అయ్యారా.. అందుకేనా బిలియనీర్స్ బంకర్స్ కట్టుకుంటున్నది..?

ప్రపంచం అంతం అవుతుందని జుకర్‌బర్గ్ లాంటి టెక్ దిగ్గజాలు డిసైడ్ అయ్యారా.. అందుకేనా బిలియనీర్స్ బంకర్స్ కట్టుకుంటున్నది..?

ప్రపంచం అంతం కాబోతున్నది.. ప్రళయం ముంచుకొస్తుందా.. భూమిపై అతి పెద్ద విపత్తు అతి త్వరలో రాబోతున్నదా.. కలియుగం అంతానికి కౌంట్ డౌన్ మొదలైందా.. ఎప్పుడో 100.. 200 ఏళ్ల తర్వాత కాదు.. ఈ కాలంలో.. రాబోయే 10, 20 ఏళ్లల్లోనే ఈ భూమి నాశనం కాబోతున్నదా.. ఇలాంటి సందేహాలు, అనుమానాలు, భయాలు కామన్ మెన్ వస్తే పిచ్చోడు రా.. మెంటలా అంటారు.. అదే టెక్ దిగ్గజాలు.. ప్రపంచ ధనవంతులకు వస్తే నిజమే అనుకుంటాం కదా.. అవును.. ఇప్పుడు ఫేస్ బుక్ అధినేత జుకర్ బర్గ్ అలాంటి ఆలోచనతోనే.. తన ఇంట్లోనే కాకుండా ప్రత్యేకంగా పెద్ద స్థలం కొనుగోలు చేసి మరీ.. అత్యంత ఆధునికమైన భూ గర్భంలో ఇళ్లు.. బంకర్స్.. బిలియనీర్స్ బంకర్స్ నిర్మించాడు.. సోషల్ మీడియా దిగ్గజం.. ప్రపంచ కుబేరుల్లో ఒకడు అయిన జుకర్ బర్గ్ బంకర్స్ నిర్మాణం వెనక ఇప్పుడు ప్రపంచం మొత్తం రాబోయే వినాశం ఏంటా అనే సందేహాలు, ప్రశ్నలతో చర్చలు మొదలయ్యాయి. 

మార్క్ జుకర్‌బర్గ్ లాంటి టెక్ బిలియనీర్లు ప్రపంచం అంతం అయిపోతుందనే ఆందోళనల్లో ఉన్నారని వారి ప్రవర్తనె చెబుతోంది. దీంతో చాలా మంది తమ ప్రాణాలను కాపాడుకోవటానికి అనుకోని పరిస్థితులను ఎదుర్కోవటానికి అండర్ గ్రౌండ్ బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు. భవిష్యత్తులో ఏఐ ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి మనిషిలా ఆలోచించటం.. తనంతట తానే నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటే వినాశనం తప్పదనే భయాలు బిలియనీర్లను వెంటాడుతున్నాయి. 

జుకర్ బర్గ్ తన విలాసవంతమైన 14వందల ఎకరాల ఎస్టేట్ లో దీనికోసం బంకర్ నిర్మించుకున్నట్లు తెలుస్తోంది. దీనితో పాటు అనేక ఇతర ప్రాంతాల్లో భారీగా ప్రాపర్టీలు కొని అక్కడ కూడా బంకర్లను సిద్ధం చేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ అండర్ గ్రౌండ్ నిర్మాణాలు అక్కడ ఉండే వారికి అవసరమైన ఆహారం, ఎనర్జీ వంటివి నిరంతరం కలిగి ఉండేలా తీర్చిదిద్దబడ్డాయి. గత సంవత్సరం మీరు డూమ్స్‌డే బంకర్‌ను నిర్మిస్తున్నారా అని మీడియా అడిగినప్పుడు, జుకర్‌బర్గ్ దానిని తోసిపుచ్చారు. కానీ పాలో ఆల్టోలో 11 ప్రాపర్టీలు కొని భారీ ఖర్చుతో రహస్య బంకర్ల నిర్మాణం చేపట్టినట్లు తేలింది. 

ఇదే సమయంలో ఓపెన్ ఏఐ సంస్థ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్మాన్ ప్రపంచ ప్రళయం సమయంలో దాక్కునేందుకు న్యూజిలాండ్ ప్రాపర్టీ కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఎవ్వరూ ఊహించని స్థాయిలో వేగంతో ఓపెన్ ఏఐ విస్తరణ, ఏఐ వినియోగం పెరుగుదలతో క-ృత్రిన జనరల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషిలాగా ఏఐ ఆలోచించటం, ఫీల్ అవ్వటం అనే టెక్నాలజీ మరో దశాబ్ధకాలంలోనే వచ్చేస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే దీనిని అందుబాటులోకి తీసుకొచ్చే ముందే బంకర్ల నిర్మాణం ఉంటుందని ఓపెన్ ఏఐ సీఈవో చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

►ALSO READ | కోల్గేట్ టూత్‌పేస్ట్ కూడా నకిలీ చేస్తున్న కేటుగాళ్లు.. ఫ్యాక్టరీ సీజ్.. ఎక్కడంటే..?

ప్రస్తుతం ఒకప్పుడు అసాధ్యం అనుకున్న పనులన్నింటినీ ఏఐ చేసేస్తోంది. పాటలు పాడటం నుంచి వైద్యం చేయటం వలకు అన్నింటా ఏఐ ముందుంది. అయితే ఏఐ నియంత్రణపై ప్రభుత్వ పర్యవేక్షణ అవసరమనే వాదనలు కూడా ఉన్నాయి. ఏఐ మనుషుల కంటే తెలివైనదిగా మారితే దానిని అదుపుచేయటం, అవసరమైతే దానిని నిలిపివేయటానికి సంసిద్ధత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. చాలా మంది బిలియనీర్లు ఈ క్రమంలో అమెరికాతో పాటు న్యూజిలాండ్ ప్రాంతంలో కూడా సేఫ్ హౌసెస్ నిర్మించుకోవటం స్పీడప్ చేశారు. ఏఐ ప్రజల జీవితాలను మెరుగుపరుస్తుందా లేక ముంచుతుందా అంటే ప్రస్తుతానికైతే సమాధానం లేదు, కానీ భయాలు మాత్రం ఉన్నాయి. దీనిపై కొందరు మాత్రం బంకర్లు నిజమైనవి. వాటి వెనుక ఉన్న భయం కూడా నిజమే కావచ్చు అని అంటున్నారు.