
2025 మొదటి అర్థభాగంలో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించిన రెండు సంప్రదాయ ఆస్తులుగా బంగారం, వెండి నిలిచాయి. దీంతో అనిశ్చితి కాలంలో తమ సత్తాను మళ్లీ అవి రాబడులతో చూపించాయి. శతాబ్దాలుగా సురక్షిత ఆస్తిగా నిలిచిన బంగారం ఈ 2025లో సుమారు 26% పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వులను పెంచుకోవడం.. పెట్టుబడిదారులు మ్యాక్రో ఆర్థిక అనిశ్చితికి సిద్ధం కావడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
ఇదే సమయంలో “వోలటైల్ కజిన్”గా పిలవబడే వెండి కూడా తన దూసుకుడు కొనసాగించింది. 2025లో వెండి ధరలు 22% పెరగగా.. దేశంలో కేజీ ధర రూ.లక్ష 40వేల రికార్డు స్థాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. పారిశ్రామికంగా ఈ లోహానికి డిమాండ్ పెరగటం రేట్ల పెరుగుదలకు మరో కారణంగా నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం, వెండి ఆట ముగియదు.
ఇక క్రిప్టోకరెన్సీ పెట్టుబడుల విషయానికి వస్తే.. పోర్టుఫోలియోలో ఖచ్చితంగా ఉండాల్సిన కొత్త ఇంజిన్‌గా మారింది. వాస్తవానికి మెుత్తం బిట్ కాయిన్ల సరఫరా 21 మిలియన్లు మాత్రమే ఉండటంతో ఈ డిజిటల్ అసెట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం దీని మార్కెట్ క్యాప్ 2.2 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. పెద్ద సంస్థల నుంచి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల వరకు క్రిప్టోను అంగీకరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ అసెట్ క్లాస్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
ALSO READ : శనివారం షాకిచ్చిన గోల్డ్ రేట్లు..
గత కొన్ని సంవత్సరాల ప్రయాణం బంగారం–బిట్‌కాయిన్ సంబంధాన్ని మరింత ఆసక్తికరంగా చేసింది. 2022 చివరి నుండి 2024 మధ్యకాలం వరకు ఈ రెండు ఆస్తులు దాదాపు ఒకే రీతిలో ర్యాలీ చేశాయి. ఆ సమయంలో బంగారం 67% పెరిగగా.. బిట్‌కాయిన్ మాత్రం ఏకంగా 400% వృద్ధితో ఇన్వెస్టర్లకు భారీ రిటర్న్స్ అందించింది. అయితే 2025లో రెండు వేరువేరుగా వ్యవహరిస్తున్నాయి. ప్రధానంగా ఆర్థిక వ్యవస్థల్లో ద్రవ్యోల్బణం వంటి కారణాలతో సెంట్రల్ బ్యాంకులు గోల్డ్ షాపింగ్ చేస్తుండగా.. సాంకేతిక పెరుగుదల బిట్ కాయిన్ కి కొత్త ఊపు ఇచ్చింది.
ఇన్వెస్టర్లు తమ పెట్టుబడిని దేనిలో ఎంత పెట్టడం బెటర్..
నిపుణుల మాటల్లో పోర్టుఫోలియో క్రికెట్ జట్టులాంటిది. అందుకే పెట్టుబడిదారులు తమ పోర్ట్ ఫోలియోలో ఈక్విటీ, గోల్డ్, సిల్వర్, క్రిప్టోలకు ప్రాముఖ్యతను ఇవ్వటం ముఖ్యం. అయితే దేనికి ఎంత అలకేట్ చేయాలనే విషయం గురించి జియోటస్ సీఈఓ విక్రమ్ సుబ్బురాజ్ ఏమని సూచిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
* ఈక్విటీల్లో పెట్టుబడిదారులు 60–70 శాతం తమ దీర్ఘకాలిక పెట్టుబడి వ్యూహంలో భాగంగా ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.
* ఇక బంగారం, వెండికి తమ పోర్ట్ ఫోలియోలో ఇన్వెస్టర్లు10–15 శాతం ఓలటాలిటీని అధిగమించటానికి కలిగి ఉండాలని సూచించారు.
* ఇక చివరిగా కొత్త పెట్టుబడి సాధనంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు అందుకున్న క్రిప్టోలకు3–7% వరకు.. కావాలంటే గరిష్టంగా 10 శాతం క్రమశిక్షణతో కలిగి ఉండటం పోర్ట్ ఫోలియోకు మంచిదని సుబ్బురాజ్ చెప్పారు.
ఇన్వెస్టర్లు రూపీ కాస్ట్ యావరేజింగ్ పరిస్థితులకు అనుగుణంగా తమ పెట్టుబడులను ముందుకు తీసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మోసగాళ్ల వలలో పడకుండా పారదర్శకమైన పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇన్వెస్ట్ చేస్తూ.. ప్రతి త్రైమాసికానికీ పోర్టుఫోలియోను రీబ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగాలని చెబుతున్నారు.