కైరో:ఇండియా టీనేజ్ సెన్సేషన్, తెలంగాణ షూటర్ ఇషా సింగ్ ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో మరో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. జూనియర్ విమెన్స్ ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఇషా సింగ్, శిఖా నర్వాల్ వర్ష సింగ్‌తో కూడిన ఇండియా గోల్డ్ గెలిచింది. మంగళవారం జరిగిన ఫైనల్లో ఇండియా త్రయం 16–6తో చైనా జట్టును చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీలో ఇషాకు ఇది మూడో మెడల్ కావడం విశేషం. మరోవైపు జూనియర్ విమెన్స్ ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో తిలోత్తమ, నాన్సీ, రిథిమాతో కూడిన ఇండియా 16–2తో చైనాను ఓడించి బంగారు పతకం గెలిచింది. సాయి కార్తీక్, దివ్యాన్ష్, విదిత్ జైన్‌తో కూడిన మెన్స్ ఎయిర్ రైఫిల్ టీమ్‌తో పాటు 25 మీ. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్‌లో పాయల్, ఆదర్శ్ గోల్డ్ నెగ్గారు.
