‘ట్రిపుల్ తలాక్’ పిటిషనర్ ను చంపేస్తామని బెదిరింపులు

‘ట్రిపుల్ తలాక్’ పిటిషనర్ ను చంపేస్తామని బెదిరింపులు

కొల్ కతా:  ట్రిపుల్ తలాక్ పిటిషనర్ ఇష్రత్ జహాన్ ను చంపేస్తామని బెదింపులు వచ్చాయి. దీంతో ఇష్రత్ పోలీసులను ఆశ్రయించింది.  ఈనెల 16న ఇష్రత్ బీజేపీ ఏర్పాటు చేసిన హనుమాన్ చాలీసా పఠనం కార్యక్రమానికి హాజరైంది. అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు ఇష్రత్ ను రౌండ్ చేసి నువ్వు ఇస్లాంకు వ్వతిరేకంగా ప్రవర్తిస్తున్నావ్ అని… హిజబ్ వేసుకుని హిందూ మత కార్యక్రమానికి వెళ్లి తప్పుచేశావ్ అని అన్నారని చెప్పింది. ఇదే కాకుండా… తనను చంపేస్తామని బెదిరించారని చెప్పింది ఇష్రత్.

తాను చుట్టాల ఇంట్లో కొడుకుతో కలిసి కిరాయికి ఉంటున్నట్లు తెలిపింది ఇష్రత్. వాళ్లు కూడా ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని చెప్పింది. తనకు ఒక కొడుకు ఉన్నాడని వాడితో ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని వాపోయింది. తనకు ప్రాణాపాయం ఉందని తనను రక్షించాలని పోలీసులను కోరింది. దీంతో పాటే హౌరా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం పై హౌరా నార్త్ ACP  ప్రతీక్షా జార్కారియా స్పందించారు. ఇష్రత్ కు రక్షణ కల్పిస్తామని చెప్పారు.