రష్యా దాడులను తిప్పికొడుతున్న జెలెన్ స్కీ సేనలు

రష్యా దాడులను తిప్పికొడుతున్న జెలెన్ స్కీ సేనలు

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలై ఇప్పటికి 27 రోజులు గడిచినా పైచేయి రష్యా సాధించలేకపోయింది. మెయిన్ సిటీలపై మిసైల్స్ తో రష్యా దాడులు చేస్తోంది. మరియుపోల్ సహా ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై దాడులు కొనసాగిస్తోంది రష్యా. రాజధాని కీవ్ సిటీలోని నివాస ప్రాంతాల మధ్య ఉన్న షాపింగ్ మాల్ పై దాడిలో 8 మంది చనిపోయారు. మరియుపొల్ లోని ఆర్ట్  స్కూల్ పై ఆదివారం నాటి బాంబు దాడి తర్వాత పరిస్థితిపై ఎలాంటి స్పష్టతరాలేదు. స్కూలుపై బాంబులు వేసిన పైలట్  అంతు చూస్తామని స్పష్టం చేశారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. మరియుపోల్ లో జరుగుతున్నది యుద్ధ నేరమన్నారు ఈయూ విదేశాంగ విధాన అధిపతి జోసెఫ్  బొరెల్ .

లొంగుబాటుకు, ఆయుధాలు వదిలేసేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేమని.. రష్యాను నమ్మలేమంది ఉక్రెయిన్. రష్యా సరఫరా వ్యవస్థల్ని ధ్వంసం చేసేలా జెలెన్ స్కీ సేనలు దాడులకు పాల్పడుతున్నాయి. రెండు దేశాల మధ్య వర్చువల్ గా చర్చలు జరిగినా.... ప్రతిష్టంభన ఇంకా తొలగలేదు. యుద్ధంలో ఇంతవరకు 902 మంది పౌరులు మృతి చెందినట్లు తెలిపింది ఐక్యరాజ్యసమితి. రష్యా-ఉక్రెయిన్  మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఇజ్రాయెల్.

 

 

ఇవి కూడా చదవండి

యుద్ధం మొత్తం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తోంది

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

భారత్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు

రాత్రిపూట యువకుడి పరుగుపై స్పందించిన ఆనంద్ మహీంద్రా