
జెరూసలేం(ఇజ్రాయెల్): ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ భార్య సారా నెతన్యాహూ(60)కి అవినీతి కేసులో జెరూసలేం కోర్టు జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ నిధులు దుబారా చేసినందుకు 15 వేల డాలర్లు జరిమానా కట్టాలని ఆదేశించింది. లగ్జరీ హోటళ్లలో మీల్స్ కోస సారా లక్ష డాలర్ల ప్రజాధనాన్ని వృథా చేశారని కోర్టు పేర్కొంది. 2010 నుంచి 2013 మధ్య ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్ చెఫ్ ఉన్నా, ఆమె కావాలనే రెస్టారెంట్లకు వెళ్లేవారని విచారణలో తేలింది. బెంజిమెన్ నెతన్యాహూపై కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. తనకు కావాల్సిన వారికి ప్రభుత్వ కాంట్రాక్టులు ఇప్పించారనే కేసుపై వచ్చే అక్టోబర్ లో విచారణ జరగాల్సివుంది.