చంద్రయాన్ 3 తీసింది.. చంద్రుడు, భూమి ఫొటోలు ఇలా..

చంద్రయాన్ 3 తీసింది.. చంద్రుడు, భూమి ఫొటోలు ఇలా..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చంద్రుడిపై అధ్యయనానికి (Moon Study) పంపిన చంద్రయాన్-3 (Chandrayaan 3) ఒక్కో అడుగు వేసుకుంటూ ముందుకెళ్తోంది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-3.. అక్కడ ఉపరితలం ఫోటోలను (Chandrayaan 3 Photos) తీసింది. ఈ ఫోటోలను చంద్రయాన్-3 మిషన్ అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేసింది ఇస్రో. జులై 14న చంద్రయాన్-3 ప్రయాణం ప్రారంభమైనప్పటి నుంచి చంద్రుడికి మూడింట రెండు వంతుల దూరాన్ని కవర్ చేసి విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించినట్లు ఇస్రో తెలిపింది. కక్ష్యలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ ఉపరితలం ఫోటోలను తీసిందని పేర్కొంది.

 

ALSO READ: పోటీ అంటే ఇదీ : ఇస్రో చంద్రయాన్ కు పోటీగా.. రష్యా లూనా 25

అంతా అనుకున్న ప్రకారమే జరిగితే ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువం (Moon South Pole) వద్ద ఉపరితలం మీద సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందని ఇస్రో తెలిపింది. మాడ్యూల్ ఎత్తును క్రమంగా తగ్గించి, చంద్రుని చుట్టూ 100 కి.మీ. దీర్ఘవృత్తాకార కక్ష్యలో దాన్ని ఉంచడం కోసం ఇస్రో అనేక విన్యాసాలు చేపడుతుంది. ఆగస్టు 6 రాత్రి మరోసారి ఇంజిన్‌ను మండించి.. చంద్రయాన్ కక్ష్యను పెంచారు. మళ్లీ ఆగస్టు 9న కూడా మరోసారి విన్యాసాలు చేపడతారు. ఈ సమయంలోనే ప్రొపల్షన్ మాడ్యూల్.. ల్యాండర్ నుంచి ఆర్బిటర్ విడిపోతుంది. ల్యాండర్ చంద్రుడి ఉపరితలం వైపు ప్రయాణాన్ని కొనసాగిస్తుంది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక గురువారం జాబిల్లికి మరింత చేరువైంది.  కక్ష్య తగ్గింపు ప్రక్రియను విజయవంతంగా చేపట్టినట్టు ఇస్రో తెలిపింది. ఇంకో రెండు సార్లు కక్ష్య తగ్గింపు ప్రక్రియలను చేపట్టాల్సి ఉంటుందని తెలిపింది.