చంద్రయాన్ కౌంట్ డౌన్.. ఈ ప్రయోగం విశిష్టత, విశేషాలు ఇవే..

చంద్రయాన్ కౌంట్ డౌన్.. ఈ ప్రయోగం విశిష్టత, విశేషాలు ఇవే..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జూలై 14 చేయబోయే చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది.  దీన్ని మధ్యాహ్నం 2గంటల 35నిమిషాలకు లాంచ్ చేయనున్నట్టు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ వెల్లడించారు. ఈసారి ఎలాగైనా చంద్రుడిపై విజయవంతంగా దిగాలని ఇస్రో గట్టిగా సంకల్పించుకుంది. చంద్రయాన్-3 అంతరిక్ష నౌక ప్రయోగించిన దాదాపు ఒక నెల తర్వాత.. చంద్రుని కక్ష్యకు చేరుకుంటుంది. అంటే స్పేస్ క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి మోసుకెళ్లే రాకెట్ 40 రోజులు ప్రయాణించనుంది. ఆగస్టు 23 లేదా 24వతేదీ నాటికి చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్ 3 ల్యాండ్ కానుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించనున్న ఈ చంద్రయాన్-3.. అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసిన నాల్గవ దేశంగా భారత్ నిలవనుంది.

మిషన్

శ్రీహరికోటలోని SDSC షార్ నుంచి LVM3 రాకెట్ ద్వారా అంతరిక్ష నౌకను ప్రయోగించనున్నారు. ఇస్రో ప్రకారం, ప్రొపల్షన్ మాడ్యూల్ ల్యాండర్, రోవర్ కాన్ఫిగరేషన్‌ను 100 కి.మీ చంద్ర కక్ష్యకు తీసుకువెళుతుంది. అక్కడ ల్యాండర్ విడిపోయి సాఫ్ట్ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ స్పెక్ట్రో-పోలారిమెట్రీ ఆఫ్ హాబిటబుల్ ప్లానెట్ ఎర్త్ (షేప్) పేలోడ్‌ను కూడా ఇది కలిగి ఉంటుంది. ఇది చంద్ర కక్ష్య నుంచి భూమి స్పెక్ట్రల్, పోలారిమెట్రిక్ కొలతలను అధ్యయనం చేయనుంది.

లక్ష్యాలు

చంద్రయాన్-3 అనేది చంద్రయాన్-2కి అప్ డేటెడ్ మిషన్. ఇది చంద్రునిపై అంతరిక్ష నౌకను సురక్షితంగా దింపడం, చంద్రుని ఉపరితలంపై రోవర్‌ను తిరుగుతూ ఉండేలా చేసి భారతదేశం సామర్థ్యాన్ని చూపించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోవర్ చంద్రుని భూగర్భంపై డేటాను సేకరించనుంది. అదనంగా, ఇది చంద్రుని పర్యావరణాన్ని అధ్యయనం చేయడానికి శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించనుంది.

సవాళ్లు

చంద్రునిపై ల్యాండింగ్ అనేది క్లిష్టమైన, సవాలుతో కూడిన పని. 2019 జూలై లో భారత్.. చంద్రునిపై అంతరిక్ష నౌకను ల్యాండ్ చేసే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత చంద్రయాన్ -2తో చంద్రుని ఉపరితలంపైకి దిగుతున్న సమయంలో విక్రమ్ ల్యాండర్ క్రాష్ అయ్యి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ప్రయోగిస్తోన్న చంద్రయాన్-3 ఎక్కవు ఇంధనంతో రూపొందించారు. ఇది మరింత దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని ఇస్తుంది. అవసరమైతే ప్రత్యామ్నాయ ల్యాండింగ్ సైట్‌కు కూడా వెళ్లేట్టుగా సెట్ చేశారు.

ALSOREAD :శివ కార్తికేయన్ చెవిలో రవితేజ వాయిస్.. సినిమా మొత్తం అంతేనట


"మేము ఇప్పటివరకు సెన్సార్, ఇంజిన్, అల్గోరిథం... లాంటి చాలా వైఫల్యాలను చూశాం. పరాజయం ఏమైనప్పటికీ, అది అవసరమైన వేగం, రేటుతో ల్యాండ్ చేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి మునుపు పొందిన పరాజయాలకు చెందిన దృశ్యాలు, నిక్షిప్రమైన ప్రోగ్రామింగ్ తో ఈ సారి ప్రయోగం చేశాం అని ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు. విక్రమ్ ల్యాండర్ ఎలా ల్యాండింగ్ చేసినా అది విద్యుత్‌ను ఉత్పత్తి చేసేలా మార్పులు చేసినట్లు ఇస్రో చీఫ్ చెప్పారు. ఇప్పటికే ల్యాండర్ అధిక వేగాలను తట్టుకోగల సామర్థ్యాన్ని కూడా పరీక్షించారు. ఇది ఇతర ఉపరితలాలపై అదనపు సౌర ఫలకాలను కలిగి ఉండనుంది.

43.5 మీటర్ల పొడవైన ఈ రాకెట్ మూడు రకాల ప్రొపెల్లెంట్స్ వినియోగించనుంది. ఇందులో స్ట్రాప్ ఆన్ బూస్టర్‌లో ఘన రూపంలో ఉండే ఇంధనాన్ని ఉపయోగిస్తారు. కోర్ దశలో ద్రవ ఇంధనం, చివరి దశలో క్రయోజనిక్స్ ఇంధనాన్ని వినియోగించారు. 204.5 టన్నుల ఘన ఇంధన శక్తి స్ట్రాప్ ఆన్ బూస్టర్లకు లభించింది. ఇక కోర్ స్టేజ్, అప్పర్ స్టేజ్‌లలో ఒక్కొక్క ప్రొపెల్లెంట్ 115.8 టన్నులు, 28.6 టన్నులు కలిగి ఉంటుంది. చంద్రయాన్ 3 బరువు 3,900 కిలోలుంటుంది. మొత్తం రాకెట్ బరువు 642 టన్నులు. అత్యంత కీలకమైన చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ త్వరలో ప్రారంభం కానుంది.