
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో మరో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. జి శాట్-31 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించారు అదికారులు. ఫ్రెంచ్ గయానాలోని కౌరు ఉపగ్రహం కేంద్రం నుంచి తెల్లవారు జామున 2 గంటల 31 నిమిషాలకు జి శాట్-31 నింగిలోకి దూసుకెళ్లింది. 2 వేల 535 కిలోల బరువు, 15 ఏళ్ల జీవిత కాల పరిమితి కలిగిన ఈ ఉపగ్రహం…. కేయూ బ్యాండ్ ట్రాన్స్ పాండర్ సామర్థ్యంతో నిర్ణీత కక్ష్యలో సేవలందించనుంది. మెరుగైన DSNG అప్ లోడ్స్, డి.టి.హెచ్ ప్రసారాలు, మొబైల్ నెట్ వర్క్స్ కోసం ఈ ప్రయోగం చేపట్టింది ఇస్రో. భారత ప్రధాన భూభాగంతో పాటు ముఖ్యంగా సముద్ర తీరాలు, దీవులకు సంబందించిన సమాచారాన్ని ఈ ఉపగ్రహం అందించనుంది.