నా తండ్రి సహా 28 మంది కొన్నేండ్లుగా రేప్ చేస్తున్నారు

నా తండ్రి సహా 28 మంది కొన్నేండ్లుగా రేప్ చేస్తున్నారు
  • SP, BSP నాయకులు కూడా నన్ను రేప్ చేశారు
  • ఆరో తరగతి నుంచే ఇది మొదలైంది

ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నకూతురిపై తాను అత్యాచారం చేయడమే కాకుండా.. తనకు తెలిసిన మరో 28 మందితో కూడా ఈ పాడు పని చేయించాడో తండ్రి. వివరాలలోకి వెళితే.. లలిత్‌పూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ట్రక్ డ్రైవర్‎గా పనిచేస్తున్నాడు. అతనికి ఓ 17 ఏళ్ల కూతురు ఉంది. ఆమె 6వ తరగతి చదివే సమయంలో తండ్రి అసభ్యకరమైన చిత్రాలను చూపించి.. తనను లైంగిక చర్యకు బలవంతం చేయడానికి ప్రయత్నించాడని బాలిక తెలిపింది. అప్పటినుంచి తనపై లైంగిక వేధింపులు మొదలయ్యాయని చెప్పింది. ఆ సమయంలో తాను నిరాకరించడంతో కొత్త బట్టలు తీసుకొచ్చి.. బైక్ రైడ్‎కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని తెలిపింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తన తల్లిని చంపేస్తానని బెదిరించాడని వాపోయింది.

తన తండ్రి తనపై అత్యాచారం చేసిన తర్వాత.. అన్నంలో మత్తుమందులు కలిపి ఒక హోటల్‌కు తీసుకెళ్లాడని.. అక్కడ ఒక వ్యక్తి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిపింది. హోటల్ గదిలో తాను స్పృహలోకి వచ్చేసరికి తన శరీరంపై బట్టలు లేవని, పైగా తనకు కడుపు నొప్పి వచ్చిందని.. దాంతో తనపై అత్యాచారం జరిగినట్లు గుర్తించానని బాలిక తెలిపింది. ఈ విధంగా ప్రతీసారి తనను ఓ కొత్త వ్యక్తి అత్యాచారం చేసేవారని బాలిక తెలిపింది. ఒకసారి సమాజ్‎వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్ తనను విభిన్నంగా అత్యాచారం చేశాడని పేర్కొంది. దానికి బాలిక అభ్యంతరం తెలపడంతో.. మీ నాన్నే నన్ను పంపించాడని తిలక్ యాదవ్ చెప్పినట్లు బాలిక తెలిపింది. తిలక్‎తో పాటు.. అతని బంధువులు, స్నేహితులు కూడా తనపై అత్యాచారం చేశారని బాలిక చెప్పింది. చివరికి తన బంధువులు కూడా తనను బలవంతం చేశారని బాలిక వాపోయింది.

ఈ దారుణాలను భరించలేక బాధితురాలు.. లలిత్‌పూర్ పోలీస్ స్టేషన్‎లో ఫిర్యాదుచేసింది. బాలిక తండ్రితో పాటు.. సమాజ్‎వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్, సమాజ్‎వాదీ పార్టీ నగర అధ్యక్షుడు రాజేష్ జైన్ జోజియా, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు దీపక్ అహిర్వార్‎లతో సహా మొత్తం 28 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ ప్రకారం.. నిందితులపై అత్యాచారం మరియు పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేశారు. కాగా.. బాధితురాలు ఫిర్యాదు దాఖలు చేసిన వెంటనే.. ఎస్‌పి జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేశారు. బాలిక చేసిన ఆరోపణలను ఆయన తిరస్కరించారు. తనను మరియు తన సోదరులను ఈ కేసులో తప్పుగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. 

For More News..

ఈ పాస్‎వర్డ్‎లు వాడితే ఈజీగా హ్యాక్ అవుతారు

బిగ్‌‌ సీ నుంచి దసరా ఆఫర్లు