ఐటీ ఎంప్లాయీస్​కు ఎంఎన్​సీల నుంచి మెయిల్స్

ఐటీ ఎంప్లాయీస్​కు ఎంఎన్​సీల నుంచి మెయిల్స్

  పూర్తి స్థాయిలో నడవనున్న సాఫ్ట్​వేర్ కంపెనీలు

హైదరాబాద్, వెలుగు: వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతికి ఐటీ కంపెనీలు పూర్తిగా ఫుల్​స్టాప్ పెట్టనున్నాయి. రెండున్నరేళ్లుగా ఇండ్లకే పరిమితమైన ఎంప్లాయీస్​ను ఆఫీసులకు రప్పించేందుకు కంపెనీలు చర్యలు చేపడుతున్నాయి. ప్రొడక్టివిటీ తగ్గిపోవడం, ఎంప్లాయీస్​మూన్ లైట్​వర్క్స్ చేస్తున్నట్లు బయటపడుతుండటంతో జాగ్రత్త పడుతున్న కంపెనీలు..  వచ్చే నెల నుంచి కచ్చితంగా అందరూ ఆఫీస్‌‌‌‌లకు రావాలని మెయిల్స్​చేస్తున్నాయి.  ఇన్ని నెలలుగా ఎంప్లాయీస్​ఇష్టానికే వదిలేసిన వర్క్ మోడల్​ను ఇప్పుడు తమ పరిధిలోకి తీసుకుంటున్నాయి. అన్ని డిపార్ట్ మెంట్ల ఎంప్లాయీస్​కు హైబ్రిడ్ వర్క్ మోడల్ వర్తిస్తుందని తెలుపుతున్నాయి.

మెయిల్స్​చేసిన ప్రముఖ కంపెనీలు

కరోనా థర్డ్ వేవ్ ముగిసిన తర్వాత  ఐటీ కంపెనీలు రీ ఓపెన్ చేసుకోవచ్చని పర్మిషన్ వచ్చిన తర్వాత తెరుచుకోవడం మొదలయ్యాయి.  స్టార్టప్‌‌‌‌లు పూర్తిగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌‌‌‌ చేసేశాయి. కానీ ఎంఎన్‌‌‌‌సీలు మాత్రం ఎంప్లాయీస్​ను సంఖ్యను కొద్దికొద్దిగా పెంచుతూ హైబ్రిడ్‌‌‌‌ మోడల్​ను కంటిన్యూ  చేస్తూ వచ్చాయి. ఇకపై ఈ విధానానికి పుల్​స్టాప్​ పెడుతూ డిసెంబర్ నుంచి అందరూ ఆఫీసులకు రావాలని సూచిస్తున్నాయి. ప్రతి ఒక్క ఉద్యోగి వారంలో రెండు, మూడ్రోజులు ఆఫీసులకు వచ్చి పనిచేయాలని మెయిల్స్ పెడుతున్నాయి. ఇక జనవరి నుంచి పూర్తిస్థాయిలో వర్క్ ఫ్రమ్ ఆఫీసును కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్‌‌‌‌ మహీంద్రా, డెలాయిట్‌‌‌‌ వంటి కంపెనీలు ఇప్పటికే ఎంప్లాయీస్​కు మెయిల్స్ పెట్టేసినట్లు సమాచారం. 

ప్రొడక్టివిటీ తగ్గిపోతుండటంతో..

కరోనా ఎఫెక్ట్​తో దాదాపు ఐటీ ఎంప్లాయీస్ అందరూ సిటీని వదిలి సొంతూళ్లకు వెళ్లిపోయారు. అక్కడి నుంచే పనులు చేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఆఫీసులకు రమ్మని మేనేజ్ మెంట్లు చెప్పినప్పటికీ చాలామంది  ఇండ్ల నుంచే వర్క్స్ చేసేందుకు మొగ్గుచూపారు. గట్టిగా చెప్తే ఉద్యోగాలు వదిలేస్తారేమోననే భయంతో కంపెనీలు వారికే ఛాయిస్​ను వదిలేశారు. కానీ యూఎస్‌‌‌‌ నుంచి ప్రాజెక్ట్‌‌‌‌లు రాకపోవడం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంప్లాయీస్​ నుంచి ప్రొడక్టివిటీ తగ్గిపోవడం కంపెనీలకు తలనొప్పిగా మారింది. దీనికితోడు రెండు, మూడు ఉద్యోగాలు చేస్తున్నవారు ఎక్కువవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఇలా మూన్ లైట్ జాబ్​చేస్తున్నవారిని కంపెనీలు గుర్తించి టర్మినేట్​చేసిన సందర్భాలున్నాయి. దీంతో ఎంప్లాయీస్​ను ఆఫీసులకు రప్పించడమే మంచిదని భావిస్తున్నాయి.

మెయిల్​ వచ్చింది

మూడేళ్ల క్రితం జాబ్​లో​జాయిన్ అయ్యా. కరోనా టైమ్ లో సిటీ నుంచి ఊరికి వచ్చి ఇక్కడే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న. కొందరు ఇప్పటికే ఆఫీసుకు వెళ్తున్నారు. వచ్చే నెల నుంచి మమ్మల్ని కూడా రమ్మని మెయిల్ వచ్చింది. - సాయి, ఎంప్లాయ్, టెక్ మహీంద్రా

వర్కింగ్ అవర్స్ తగ్గొచ్చు..

రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్​ చేస్తున్నా. ఎన్ని గంటలు పనిచేస్తున్నామో తెలియడం లేదు. ఆఫీసు నుంచి పనిచేస్తే వర్కింగ్​అవర్స్ అయినా తగ్గుతాయని అనుకుంటున్నా. ఆఫీసుకు రావాలని ఇటీవల మెయిల్ వచ్చింది. క్యాంపస్ సెలక్ట్ చేసుకునే పనిలో ఉన్నా. - దీపిక, ఎంప్లాయ్, ఇన్ఫోసిస్