రూ.1,745 కోట్లు చెల్లించండి... కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు

రూ.1,745 కోట్లు చెల్లించండి... కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్(ఐటీ శాఖ) మరోసారి నోటీసులు జారీ చేసింది. రూ.1745 కోట్లకు ఐటీ శాఖ డిమాండ్‌‌ నోటీసులు ఇచ్చింది. 2014–15 నుంచి 2016–17 అసెస్ మెంట్ ఇయర్స్​కు సంబంధించి ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరింది. ఈ నోటీసులతో కాంగ్రెస్ చెల్లించాల్సిన మొత్తం రూ.3,567 కోట్లకు చేరుకుంది. 2014–15లో (రూ.664 కోట్లు), 2015–16లో (రూ.664 కోట్లు), 2016–17లో (రూ.417 కోట్లు)  చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.

 కాగా, రాజకీయ పార్టీలకు ఇస్తున్న పన్ను మినహాయింపులకు అధికారులు ముగింపు పలికారు. కాంగ్రెస్ పార్టీకి అందిన మొత్తం నిధులపై పన్ను విధించారు. శుక్రవారం కూడా ఐటీ శాఖ రూ.1823 కోట్లు చెల్లించాలని కాంగ్రెస్​ను కోరింది. గత అసెస్ మెంట్ ఇయర్స్​కు సంబంధించి పార్టీ ఖాతాల నుంచి రూ.135 కోట్లను ఐటీ శాఖ ఇప్పటికే రికవరీ చేసింది. దీనిపై హైకోర్టు ఇన్ కంట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్​ను ఆశ్రయించగా కాంగ్రెస్​కు ఎదురు దెబ్బ తగింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.