ఈ కష్టం పగోడికి రాకుడదు : బంకర్లలో తలదాచుకుంటున్న ట్రంప్

ఈ  కష్టం పగోడికి  రాకుడదు : బంకర్లలో తలదాచుకుంటున్న ట్రంప్

పాపం ట్రంప్ కొచ్చిన కష్టం పగోడికి  రాకూడదని అంటున్నారు నెటిజన్లు. ఓ వైపు ఎన్నికలు, మరో వైపు ఆందోళనలు.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. వెరసీ ఏం చేయాలో పాలుపోక ట్రంప్ జుట్టుపీక్కుంటున్నట్లు తెలుస్తోంది.

కరోనా కారణంగా అగ్రరాజ్యం అమెరికా ఉనికిని కోల్పోతుంది. తన అపారమైన వనరులతో ఇరు దేశాల్ని శాసిస్తున్న అమెరికాకు ప్రస్తుతం ఆర్ధిక, వ్యాపార, ఉద్యోగ పరంగా భారీగా నష్టపోతుంది. దీనికితోడు నల్ల జాతీయులు  – తెల్ల జాతీయల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఇటీవల అమెరికా మిన్నెపొలిస్‌లో తెల్ల పోలీసు కారణంగా నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ మరణించాడు.  నల్ల జాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్ ను తెల్ల జాతీయులైన పోలీసులు కొట్టి చంపడంపై నల్ల జాతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని అనేక రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు.

ఆ నిరసనలు ట్రంప్ ను  కూడా తాకాయి. వైట్ హౌజ్ ఎదుట ఆందోళన కారులు విధ్వంసం సృష్టించారు. ప్రత్యక్షంగా వైట్ హౌజ్ ఎదురుగా ఉన్న గోడల్ని ధ్వంసం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఈ సందర్భంగా ఆందోళన కారులు వైట్ హౌజ్ లోపలికి ప్రయత్నించగా..సెక్యూరిటీ వారిని వారించే ప్రయత్నం చేసింది.

ఆందోళనకారులు  వైట్ హౌజ్ లో లోపలికి ప్రవేశిస్తున్నారని సమాచారం అందుకున్న ట్రంప్ ..వారి కుటుంబంతో సహా అందరిని బంకర్లకు తీసుకెళ్లినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.