
రంగారెడ్డి: అధిక వడ్డీల పేరుతో జనాలను మోసం చేసిన విజయ లక్ష్మి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ప్లాన్ ప్రకారమే రంగా రెడ్డి జిల్లా కోర్టులో తన దగ్గర డబ్బులు లేవంటూ విజయ లక్ష్మి IP( insolvency petition) దాఖలు చేసిందని బయటపడింది. దీంతో వనస్థలిపురం పోలీసు స్టేషన్ కు విజయ లక్ష్మి బాధితులు క్యూ కడుతున్నారు. అధిక వడ్డీల పేరుతో దాదాపు 45 మంది నుంచి రూ.12 కోట్లు కాజేసి విజయ లక్ష్మి పరార్ అయ్యింది. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను బాధితులు ఆశ్రయించారు.