మంత్రి మల్లారెడ్డితో పాటు 14 మందికి ఐటీ నోటీసులు

మంత్రి మల్లారెడ్డితో పాటు 14 మందికి ఐటీ నోటీసులు

ఐటీ (ఆదాయపు పన్ను విభాగం) సోదాల్లో భాగంగా మంత్రి మల్లారెడ్డితో పాటు 14 మందికి అధికారులు నోటీసులిచ్చారు. సోమ, మంగళవారాల్లో (28,29 తేదీల్లో)  విచారణను ఎదుర్కోవాలని, ఐటీ అధికారుల ఎదుట హాజరుకావాలన్నారు. మల్లారెడ్డి సోదరులు, కుమారులు, అల్లుడుతో పాటు సన్నిహితులు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి నోటీసులు జారీ చేశారు. ఆస్తుల లావాదేవీలతో పాటు ఆర్థిక లావాదేవీల వ్యవహారాలపై వీరందరిని ఐటీ అధికారులు విచారించనున్నారు. విద్యాసంస్థల్లో డొనేషన్లపై ప్రధానంగా ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది.

మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. రెండున్నర రోజుల పాటు 400 మంది అధికారులు 65 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. పలు పత్రాలు, నగదును స్వాధీనం చేసుకున్న ఐటీ బృందాలు.. మంత్రి సహా ఆయన బంధువులకు సమన్లు జారీ చేశారు. ఈనెల 28, 29 తేదీల్లో విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని ఐటీ అధికార వర్గాలు ఆదేశించాయి.