ఐటీ విచారణకు హాజరుకానున్న మల్లారెడ్డి కొడుకు, కోడలు

ఐటీ విచారణకు హాజరుకానున్న మల్లారెడ్డి కొడుకు, కోడలు

హైదరాబాద్ : మంత్రి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు రెండో రోజు ఐటీ విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ ఆయన పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి, కోడలు షాలినిని అధికారులు ప్రశ్నించనున్నారు. మల్లారెడ్డి కాలేజీలకు చెందిన డైరెక్టర్లు, అకౌంటెంట్లు, ప్రిన్సిపాల్లను సైతం విచారించనున్నారు. ఐటీ అధికారులు నిన్న 12 మందిని ప్రశ్నించారు. 

మల్లారెడ్డి చిన్న కొడుకు భద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, మర్రి లక్ష్మణ్ రెడ్డి, కాలేజీల ప్రిన్సిపాల్స్, డైరెక్టర్ల నుంచి పలురకాల సమాచారం సేకరించారు. ముఖ్యంగా ఫీజుల లెక్కలు, సీట్ల కేటాయింపుపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. గత ఆరేండ్లుగా నిర్వహించిన ఆర్థిక లావాదేవీల వివరాలను ఐటీ అధికారులు సేకరించినట్లు సమాచారం. నిన్న విచారణకు హాజరైన వారందరూ అవసరముంటే మళ్లీ పిలుస్తామని విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.