
దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును అందుకున్నారు సముద్రఖని. ఇటీవల ‘బ్రో’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన ఆయన.. ప్రస్తుతం యాక్టర్‌గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఓ పొలిటికల్ లీడర్ బయోపిక్‌లో నటించేందుకు సముద్రఖని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ రాజకీయ నాయకుడి గురించి తెలుసుకుని, అలాంటి వ్యక్తి గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే సముద్రఖని ఒప్పుకున్నారట.
ఈ మూవీకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ధనరాజ్ దర్శకత్వంలో సముద్రఖని లీడ్ రోల్‌లో ఓ సినిమా చేస్తున్నారు.