ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో రెండేళ్లుగా నియామకాలు లేవు

ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో రెండేళ్లుగా నియామకాలు లేవు
  •     సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లోనూ పరిస్థితి అంతే: క్వెస్‌‌‌‌ కార్ప్‌‌‌‌ సీఈఓ గురు ప్రసాద్‌‌‌‌

న్యూఢిల్లీ: ఐటీ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో  గత 6–-7 క్వార్టర్లు (సుమారు రెండేళ్లు) గా    పెద్దగా నియామకాలు జరగలేదని , ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో కూడా డిమాండ్ పెరిగే సంకేతాలు కనిపించడం లేదని  క్వెస్ కార్ప్ సీఈఓ  గురుప్రసాద్ శ్రీనివాసన్ తెలిపారు. 

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీలు), నాన్-ఐటీ కంపెనీల నుంచి టెక్నాలజీ ట్యాలెంట్‌‌‌‌కు డిమాండ్ ఉందని,   నియామకాల్లో  73శాతం వీటి నుంచే వస్తోందని అన్నారు. ‘‘ ఏఐ, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఈ రోల్స్‌‌‌‌ కోసం సగటు జీతం రూ.1.25 లక్షలుగా ఉంది”అని గురు ప్రసాద్ పేర్కొన్నారు. కాగా,  క్వెస్ కార్ప్‌‌‌‌కు ఈ ఏడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో రూ.51 కోట్ల నికర లాభం వచ్చింది.