హెటిరోపై ఐటీ సోదాలు..రూ.142 కోట్లు స్వాధీనం

హెటిరోపై ఐటీ సోదాలు..రూ.142 కోట్లు స్వాధీనం

హెటిరో ఫార్మా సంస్థలో సోదాలపై ఐటీ శాఖ కీలక ప్రకటన చేసింది. సోదాల్లో 142 కోట్ల 87లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.  మొత్తం 16 బ్యాంకు లాకర్లు గుర్తించామన్నారు అధికారులు. ఇప్పటి వరకు లెక్కల్లో చూపని 550 కోట్లు ఆదాయం గుర్తించినట్లు తెలిపారు. ఆరు రాష్ట్రాల్లో.. 50 ప్రాంతాల్లో 50 టీమ్స్ తో సోదాలు జరిపామన్నారు. హెటిరో ఫార్మా.. యూరప్ , అమెరికాకు డ్రగ్స్  ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపింది ఐటి శాఖ. సంస్థకు సంబంధించిన ప్రదేశాల్లో.. పలు రహస్య స్థావరాల్లో లెక్కలకు సంబంధించిన పుస్తకాలు, నగదు, ఖాతాలు, నగదుకు సంబంధించిన రెండవ సెట్ పుస్తకాలు కనుగొన్నామన్నారు అధికారులు. డిజిటల్ మీడియా, పెన్ డ్రైవ్ లు, డాక్యుమెంట్ల రూపంలో నేరపూరితమైన సాక్ష్యాలను స్వాధీనం చేసుకున్నామని ప్రకటించారు. ఉనికిలో లేని సంస్థల నుంచి చేసిన కొనుగోళ్లలో వ్యత్యాసాలు లాంటివి బయటపడ్డాయన్నారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ కంటే తక్కువగా కొనుగోలు చేసిన భూముల వివరాలు, ఇతర అనేక విషయాలు గుర్తించామన్నారు ఐటీ అధికారులు.  

మరిన్ని వార్తల కోసం

క్వార్టర్ సీసాతో బతుకుతమా?..కాళేశ్వరంతో బతుకుతమా?

విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్.. ఎక్కడ చదువుకున్నావ్?