స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో TRS నేతల మధ్య కుస్తీ మొదలైంది. మరోసారి శ్రీహరి వర్సెస్ రాజయ్య పాలిటిక్స్ పీక్ స్టేజ్ కు చేరాయి. MLC కడియం శ్రీహరిని మరోసారి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య టార్గెట్ చేయటం హాట్ టాఫిక్ గా మారింది. ఇన్ డైరెక్ట్ గా కడియం శ్రీహరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు ఎమ్మెల్యే. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు హయాంలో స్టేషన్ ఘన్ పూర్ లో జరిగినన్ని ఎన్ కౌంటర్లు... ఉమ్మడి APలో ఎక్కడా జరగలేదని ఇన్ డైరెక్ట్ గా కడియం శ్రీహరిని టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. తాజాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కూడా ఎమ్మెల్సీ కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి.
ఎవరెక్కడ పోటీ చేయాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది
ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపణలపై ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు . రాజయ్య వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాజయ్యకు ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీకి చెప్పుకోవాలన్నారు. రాజయ్య తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఎవరి అడ్డ, జాగీరు కాదన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజయ్య ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరెక్కడ పోటీ చేయాలన్నది పార్టీ నిర్ణయిస్తుందన్నారు. రాజయ్య తీవ్రమైన నిరాశ,నిస్పృహలో ఉన్నారని..మతిస్థిమితం లేనట్టుగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే రాజయ్య ప్రజల మద్దతు కోల్పోతున్నరు
ప్రజల మద్దతును ఎమ్మెల్యే రాజయ్య కోల్పోతున్నారని కడియం శ్రీహరి తెలిపారు. తనపై చేసిన కామెంట్స్ ని బేషరుతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజయ్యకంటే ముందు మూడుసార్లు ప్రాతినిధ్యం వహించిన తనపై తీవ్ర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాజయ్య విజయం కోసం తామంతా ఎంతో కష్టపడ్డామన్నారు. స్టేషన్ ఘన్ పూర్ ఎవరి అడ్డా,జాగీరు కాదు అన్నారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఏం చేశారని నిలదీశారు. భారతదేశంలో ఉపముఖ్యమంత్రిగా భర్తరఫ్ అయిన మొదటి వ్యక్తి రాజయ్యే అన్నారు.
