
కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో నర్స్.,డాక్టర్ ని హత్య చేశాడు. ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇటలీకి చెందిన ప్రియుడు ఆంటోనియో డిపేస్ (28), ప్రియురాలు లోరెనా క్వారంటా(27) ఇద్దరు సిసిలీయాన్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. ఆంటోనియో నర్స్ గా పనిచేస్తుంటే క్వారంటా డాక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. అయితే కరోనా వైరస్ బాధితులకు ట్రీట్ మెంట్ ఇచ్చిన డాక్టర్లు చనిపోతుండడంతో..భయాందోళనకు గురైన ఆంటోనియో..డాక్టర్ క్వారంటా కు కరోనా వైరస్ సోకిందని అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో ప్రియురాల్ని హత్య చేసి ఆపై తాను ఆత్మహత్య కు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు తాను, తన ప్రియురాలైన క్వారంటాను హత్య చేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు.
అనంతరం ప్రియురాలి హత్య చేసి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాధితుడి ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు..అతను నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ కు వెళ్లాడు. అప్పటికే ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు. డాక్టర్ క్వారంటా మరణించగా నర్స్ ఆంటోనియా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. కొనఊపిరితో ఉన్న ఆంటోనియాను పోలీసులు ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు.
అనంతరం తన ప్రియురాలు క్వారంటాకు కరోనా వైరస్ సోకిందని, అందుకే హత్య చేశానని, తాను లేకుండా నేను ఉండలేను కాబట్టి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించినట్లు పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు ఇద్దరి బ్లడ్ శాంపిల్స్ ను కరోనా వైరస్ టెస్ట్ కు పంపించారు. అందులో నెగిటీవ్ రావడంతో ..కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒత్తిడి వల్లే ఆంటోనియా క్వారంటాను హత్య చేశాడా..? లేదంటే ఇంకేమైనా ఇతర కారణాలున్నాయా అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.