గడ్డకట్టే మంచులో.. 18వేల ఫీట్ల ఎత్తులో.. సైన్యం యోగా

గడ్డకట్టే మంచులో.. 18వేల ఫీట్ల ఎత్తులో.. సైన్యం యోగా

జమ్ముకశ్మీర్ : జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సన్నాహకాలు కొనసాగుతున్నాయి. ఆరోగ్యం, మనశ్శాంతి అందించే భారతీయ ప్రాచీన సంప్రదాయం యోగాను భారీ స్థాయిలో జరపాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఐదేళ్లుగా ఏటేటా విస్తృతస్థాయిలో నిర్వహిస్తోంది. ఈసారి కూడా యోగా డే కోసం ముందస్తు కసరత్తు చేస్తోంది. ఇందుకు సైన్యం కూడా తమవంతు సహకారం అందిస్తోంది.

టిబెట్ సరిహద్దులోని లడఖ్ లో ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు యోగా చేశారు. మంచుకొండల మధ్య.. భూమికి 18వేల అడుగుల ఎత్తులో యోగాసనాలు వేశారు సరిహద్దు గస్తీ పోలీసులు. సూర్యనమస్కారాలు చేశారు.