న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కంపెనీలు, అకౌంట్లు ఆడిట్ చేయించాల్సిన పన్ను చెల్లింపుదారుల కోసం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇన్‌కమ్ ట్యాక్ రిటర్న్ (ఐటీఆర్) ఫైలింగ్ గడువును డిసెంబర్ 10 వరకు పొడిగించింది. సాధారణంగా వీరు అక్టోబర్ 31లోపు ఐటీఆర్ ఫైల్ చేయాలి. దీంతో పాటు ఆడిట్ రిపోర్ట్‌లను సబ్మిట్ చేయాల్సిన డెడ్‌లైన్‌ను నవంబర్ 10 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) పొడిగించింది.
వరదలు, ప్రకృతి విపత్తుల వల్ల కొన్ని ప్రాంతాల్లో వ్యాపార కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని ఈ సంస్థ పేర్కొంది. ప్రజల అభ్యర్ధన మేరకు ఐటీఆర్ డెడ్‌లైన్‌ను పొడిగించామని తెలిపింది. కాగా, 2025–26 సంవత్సరానికి గాను ఇండివిడ్యువల్స్, హిందూ అన్‌డివైడెడ్ ఫ్యామిలీలు ఫైల్ చేయాల్సిన ఐటీఆర్ గడువును జులై 31 నుంచి సెప్టెంబర్ 16 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 16 నాటికి 7.54 కోట్ల ఐటీఆర్‌లు ఫైల్ కాగా, 1.28 కోట్ల మంది సెల్ఫ్-అసెస్మెంట్ టాక్స్ చెల్లించారు.
