మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ కపూర్

మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ కపూర్

బాలీవుడ్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించింది. ఇవాళ ఉదయం బాబు పుట్టాడంటూ సోనమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంది. 'ఆగస్టు 20.08.2022 నాడు అందమైన బాబు మా ప్రపంచంలో అడుగుపెట్టాడు. వైద్యులు, నర్సులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఈ జర్నీలో నాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది ప్రారంభం మాత్రమే, బాబు రాకతో మా జీవితాలే మారిపోతాయన్న విషయం మాకు తెలుసు.. సోనమ్‌ – ఆనంద్‌' అని తెలిపింది.

సోనమ్, ఆనంద్‌ అహుజాలు 2018 మేలో పెళ్లి చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో తాను గర్భవతినన్న విషయాన్ని వెల్లడించింది ఈ బ్యూటీ. ఆ తర్వాత మెటర్నటీ షూట్‌ చేయించుకున్న ఫొటోలను సైతం సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ మధ్య లండన్‌లో సీమంతం జరుపుకోగా ఆ ఫొటోలు కూడా నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం సోనమ్ ఈ గుడ్ న్యూస్ చెప్పడంతో ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.