DUDE Collection: రికార్డులు సృష్టిస్తోన్న ‘డ్యూడ్’.. రెండు రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

DUDE Collection: రికార్డులు సృష్టిస్తోన్న ‘డ్యూడ్’.. రెండు రోజుల్లో అదిరిపోయే కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

హీరో ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’తో మరోసారి ఆడియన్స్కి తెగనచ్చేసాడు. యూత్ఫుల్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ‘డ్యూడ్’ రెండు రోజుల కలెక్షన్స్ ప్రకటించారు మేకర్స్. అక్టోబర్ 17న థియేటర్లలో విడుదలైన డ్యూడ్.. రెండు రోజులకు కలిపి రూ.45 కోట్ల గ్రాస్ వసూలు చేసి రికార్డులు సృష్టిస్తోంది.

‘‘ప్రేక్షకుల నుండి భారీ ప్రేమతో.. బాక్సాఫీస్ వద్ద డ్యూడ్ కొనసాగుతోంది. దీపావళికి డ్యూడ్ అసలైన బ్లాస్ట్గా తిరుగులేని విజయాన్ని అందుకుంటోంది. డ్యూడ్ 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.45 కోట్లు వసూలు చేసి సూపర్ స్ట్రాంగ్గా ఉంది. మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకుని దీపావళిని జరుపుకోండి డ్యూడ్’’ అని మేకర్స్ తెలిపారు.

డ్యూడ్ తొలిరోజు రూ.22 కోట్ల గ్రాస్ సాధించగా, రెండో రోజు ఏకంగా రూ.23 కోట్లు వసూలు చేసింది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రెండు రోజులకు కలిపి రూ.45 కోట్ల గ్రాస్తో దూసుకెళ్తోంది. ఇక నెట్ వసూళ్ళ విషయానికి వస్తే.. ఇండియాలో రెండ్రోజులు కలుపుకుని రూ.23.10 కోట్ల నెట్ సాధించింది. ఓవర్సీస్ లోను డ్యూడ్ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. దాదాపు రూ.4 కోట్లకి పైగా వసూళ్లను క్రాస్ చేసి, అక్కడ సత్తా చాటుకునే పనిలోపడింది. 

Also Read : ఎట్టకేలకు ఓటీటీలోకి ఆస్కార్ నామినేట్ ఫిల్మ్ 

తన శైలి కామెడీ టైమింగ్, స్టైలిష్ ఎలిమెంట్స్తో పాటుగా బలమైన ఎమోషన్స్ తోనూ ప్రదీప్ మెప్పించాడు. ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ.. ప్రదీప్ నటించిన విధానం ఆడియన్స్కు ఫిదా అవుతున్నారు. ప్రదీప్-మమితా బైజుల కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. కులాంతర వివాహాలు, పరువు హత్యల నేపథ్యంలో ఇచ్చిన సందేశం యువతని ఆలోచింపజేస్తుంది. 

డ్యూడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్:

డ్యూడ్ తొలిరోజు బాక్సాఫీస్ కలెక్షన్లలో అదరగొట్టింది. శుక్రవారం (అక్టోబర్ 17న) విడుదలైన డ్యూడ్ సినిమాకు.. ఫస్ట్ డే ఇండియాలో రూ.10 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తెలుగులో రూ.3.25 కోట్లు వసూళ్లు చేయగా.. తమిళంలో అత్యధికంగా రూ.6.75 కోట్లు సాధించి శభాష్ అనిపించుకుందని తెలిపింది. రెండో రోజు శనివారం ఇండియాలో రూ.10 కోట్ల నెట్ కలెక్ట్ సాధించింది.  తెలుగులో రూ.2.75 కోట్లు వసూళ్లు చేయగా.. తమిళంలో రూ.7.25కోట్లు దక్కించుకుంది.