లండన్: ఐటీటీఎఫ్ వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో ఇండియా విమెన్స్ టీమ్ కీలక విజయం సాధించింది. బుధవారం జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో ఇండియా 3-2తో ఉక్రెయిన్‌పై గెలిచి మెయిన్ డ్రా అర్హత అవకాశాలను మెరుగుపరుచుకుంది. తొలి మ్యాచ్‌లో మనికా బత్రా 3-1తో టెట్యానా బిలెంకోపై నెగ్గగా, రెండో పోరులో మార్గరీటా చేతిలో యశస్విని ఘోర్పడే పోరాడి ఓడింది.
మూడో మ్యాచ్‌లో దియా చితాలే 3-0తో వెరోనికా మత్యునినాను చిత్తు చేసింది. కానీ, రివర్స్ సింగిల్స్‌లో మనికపై మార్గరీటా నెగ్గడంతో స్కోరు 2-2తో సమం అయింది. విన్నర్‌ను తేల్చే ఆఖరి పోరులో యశస్విని 3–-1తో టెట్యానాపై గెలిచి ఇండియాకు విజయం అందించింది.గురువారం రువాండాతో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్‌లో గెలిస్తే ఇండియా గ్రూప్ టాపర్‌గా తర్వాతి రౌండ్‌కు చేరుకుంటుంది.

